Honey Rose: హనీరోజ్‌కి కేరళలో ఇంత ఫాలోయింగా.. చూస్తే స్టన్ అవ్వడం ఖాయం
వీరసింహారెడ్డి జోష్‌తో టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని హనీ ఎదురుచూస్తుంది. మరోవైపు బాలయ్య తదుపరి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించనుంది.
‘వీరసింహారెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా తెలుగునాట ఫేమస్ అయ్యింది కేరళ భామ హనీ రోజ్. అప్పుడెప్పుడో 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాలో నటించినప్పటికీ.. అప్పుడు అంత ఫేమస్ అవ్వలేదు. ఇప్పుడు అయితే మన కుర్రాళ్లు హనీ రోజ్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. ఏం బ్యూటీరా ఈమెది అంటూ తెగ పొగడ్తలు కుమ్మేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ‘వీరసింహారెడ్డి’ సినిమా ద్వారా శృతి హాసన్ కంటే హనీ రోజ్‌కే ఎక్కువ పేరు వచ్చింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కేరళ మన్నార్‌కడ్‌లో ‘మైజీ ఫ్యూచర్’ అనే షాప్ ఓపెన్ చేసేందుకు అతిథిగా వెళ్లింది హనీరోజ్. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల ఊర్లు కాదు.. ఏకంగా జిల్లాల నుంచే అభిమానులు తరలివచ్చారు. అక్కడికి వచ్చిన జనాన్ని చూసి నిర్వాహకులు స్టన్ అయ్యారు. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు, పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అతి కష్టం మీద షాపు ఓపెన్ చేసి.. తిరిగి రిటన్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమెపై ఎగబడ్డారు. ఫొటోలు, సెల్ఫీలు కోసం తెగ ఆరాటపడ్డారు. హనీ రోజ్ కారెక్కే సమయానికి కొంతమంది ఆమెపై మీద పడిపోయారు. అయినప్పటికీ ఆమె అసహనం ప్రదర్శించలేదు. చిరు నవ్వుతో బాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను హనీ రోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది ట్రెండ్ అవుతుంది.
View this post on Instagram
2005 నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తున్న హానీ రోజ్‌కు అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా తెలుగులోనూ ఆమె మంచి ఫాలోయింగ్ దక్కించుకుని.. కెరీర్ పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..