Kabzaa Song Launch: ‘కబ్జ’ కోసం వచ్చిన దమ్కీ విశ్వక్ సేన్.. హైదరాబాద్ చేరిన కన్నడ స్టార్స్.. (లైవ్)
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.. ఆయన నటించిన చాలా సినిమాలు మనదగ్గర డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఉపేంద్ర మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.. ఆయన నటించిన చాలా సినిమాలు మనదగ్గర డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఉపేంద్ర మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’. శాండిల్‌వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు.ఉపేందర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘కబ్జా’ టీజర్‌తో ఈ పీరియాడిక్ ఫిల్మ్‌పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. ఇండియాలో ఓ గ్యాంగ్‌స్టర్ క్రమ క్రమంగా ఎలా ఎదిగాడనేదే ‘కబ్జా’ చిత్రం. 1947 నుంచి 1984 కాలంలో నడిచే కథ. స్వాతంత్య్ర సమర యోధుడు కొడుకు మాఫియా వరల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..