Deepak Chahar: టీమిండియా క్రికెటర్‌ సతీమణిని చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

టీమిండియా స్టార్‌ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. జయ కొందరికి డబ్బులు ఇచ్చారని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరినందుకు గానూ ఆమెకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై దీపక్ తండ్రి ఆగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Deepak Chahar: టీమిండియా క్రికెటర్‌ సతీమణిని చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
Deepak Chahar Jaya Bhardwaj
Follow us

|

Updated on: Feb 03, 2023 | 9:22 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. జయ కొందరికి డబ్బులు ఇచ్చారని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరినందుకు గానూ ఆమెకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై దీపక్ తండ్రి ఆగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. తన కోడలు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తానని బెదిరింపులు వచ్చాయని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని దీపక్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. పారిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్‌ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పంపించారామె. అయితే ఆ తర్వాత డబ్బును దుర్వినియోగం చేశారు. దీంతో డబ్బు చెల్లించాలని జయ అడగ్గా తండ్రీ కుమారులు తమ కోడలిని బెదిరించారని, అసభ్యకర మాటలతో దుర్భాషలాడారని దీపక్ తండ్రి చెప్పారు. కమలేష్ హెచ్‌సిఏలో టీమ్‌లకు మేనేజర్‌గా ఉండగా, అతని కుమారుడికి ఎంజి రోడ్‌లో పారిఖ్ స్పోర్ట్స్ అనే షాప్ ఉంది.

ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా దీపక్ చాహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగాటీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు చాహర్. గాయం కారణంగా కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..