సురేఖా వాణి ఇంట్లో సీనియర్ నటీమణుల గెట్‌ టు గెదర్‌.. రక్కమ్మ పాటకు డ్యాన్స్‌లేస్తూ సందడి.. వీడియో వైరల్‌

హేమ, సన, బిగ్‌బాస్‌ ప్రియ, రజిత.. ఇలా మొత్తం 12 మంది సీనియర్‌ నటీమణులు సురేఖ వాణి ఇంట్లో గెట్‌ టు గెదర్‌ అయ్యారు. అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. హుషారుగా డ్యాన్స్‌లు చేశారు.

సురేఖా వాణి ఇంట్లో సీనియర్ నటీమణుల గెట్‌ టు గెదర్‌.. రక్కమ్మ పాటకు డ్యాన్స్‌లేస్తూ సందడి.. వీడియో వైరల్‌
Actress Surekhavani
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2023 | 9:21 PM

సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోన్న సురేఖా వాణి సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా కూతురితో కలిసి ఆమె వేసే డ్యాన్సులకు మిలియన్ల వ్యూస్‌, లక్షలాది లైకులు వస్తుంటాయి. ట్రోల్స్‌ కూడా వస్తుంటాయి అనుకోండి వేరే విషయం.. అయితే సామాజిక మాధ్యమాల్లో సురేఖవాణికి మాత్రం మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా మరో డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేసింది సురేఖ. అయితే ఇందులో కూతురు లేదు. ఆమె స్థానంలో తన కో ఆర్టిస్టులు వచ్చి చేరారు. వారెవరో కాదు.. హేమ, సన, బిగ్‌బాస్‌ ప్రియ, రజిత.. ఇలా మొత్తం 12 మంది సీనియర్‌ నటీమణులు సురేఖ వాణి ఇంట్లో గెట్‌ టు గెదర్‌ అయ్యారు. అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. హుషారుగా డ్యాన్స్‌లు చేశారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్‌ నటించిన విక్రాంత్‌ రోణ సినిమాలోని ‘రా రా రక్కమ్మ’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు కూడా వేశారు. ఈ వీడియోని స్వయంగా సురేఖావాణినే తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

కాగా చాలా రోజుల తర్వాత సీనియర్‌ నటీమణులను ఒకేసారి చూడటంతో నెటిజన్లు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. వీరి ఫొటోలు, వీడియోలు చూస్తూ లైకులు, కామెంట్ల వర్షం కురిస్తున్నారు. అదే సమయంలో ‘ప్రగతి, పవిత్రా, సుధ కూడా ఉంటే బాగుండు’ అని ఒకరు కామెంట్ పెట్టాడు. మరికొంత రైతే ‘వుయ్ మిస్ పవిత్రా లోకేశ్’ అంటూ స్పందించారు. కాగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది సురేఖా వాణి. అనారోగ్యంతో భర్త మరణించడంతో.. ఆమె జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఎదురయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.