Kailash Kher: స్టార్‌ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌కు చేదు అనుభవం.. వాటర్‌ బాటిల్స్‌తో యువకుల దాడి.. తప్పిన ప్రమాదం

సంగీత ప్రపంచంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న కైలాశ్‌ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో హంపీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనపై కొందరు యువకుడు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు.

Kailash Kher: స్టార్‌ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌కు చేదు అనుభవం.. వాటర్‌ బాటిల్స్‌తో యువకుల దాడి.. తప్పిన ప్రమాదం
Singer Khailash Kher
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 1:27 PM

ప్రభాస్‌ నటించిన మిర్చి సినిమాలో ‘పండగలా దిగివొచ్చావు’ పాటతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్‌ సింగర్‌ కైలాష్‌ ఖేర్‌. అప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో పాటలను ఆలపించిన ఆయన మిర్చి పాటతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌తో పాటు సంగీతాభిమాలను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత భరత్‌ అనే నేను, గోపాల గోపాల, రుద్రమదేవి, జయజానకి నాయక, చిత్రలహారి, అరవింద సమేత వీర రాఘవ, ఉప్పెన, కొండపొలం లాంటి హిట్‌ సినిమాల్లోని పాటలకు తన గొంతును అందించారు. పాన్‌ ఇండియా సినిమా బాహుబలి హిందీ, తమిళ వెర్షన్ల పాటలను ఆయనే ఆలపించడం విశేషం. ఇలా సంగీత ప్రపంచంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళుతోన్న కైలాశ్‌ ఖేర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో హంపీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనపై కొందరు యువకుడు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. దీంతో కైలాశ్‌తో పాటు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవలే టాలీవుడ్‌ ఫోక్‌ సింగర్‌ మంగ్లీపై కూడా కర్ణాటక గడ్డపైనే దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎప్పటిలాగానే కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా హంపీ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. అయితే, తమకు కన్నడ పాటలు కావాలని డిమాండ్‌ చేస్తూ జన సమూహంలో నుంచి ఇద్దరు యువకులు ఆయనపైకి వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో స్టార్‌ సింగర్‌తో సహా అక్కడున్న వారందరూ షాక్‌కు గురయ్యారు. కాగా బాటిల్స్‌ పడినప్పటికీ కైలాశ్‌ ఖేర్‌ పట్టించుకోకుండా తన మ్యూజిక్‌ కన్సర్ట్‌ను కొనసాగించారు. అనంతరం స్టేజ్‌పై ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ బాటిల్స్‌ను తీసేశారు. ఈ ఘటనకు పాల్పడిన యువుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన మొత్తం హిందీ పాటలే పాడుతున్నారని, కన్నడ పాటలు ఆలపించడం లేదనే ఆగ్రహంతోనే బాటిల్‌ విసిరినట్లు సదరు యువకులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..