AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను లేచి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది..! చంద్రహాస్ గుంజి గుంజి పాట పై స్పందించిన జేడీ చక్రవర్తి

సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన చంద్రహాస్, ఇలాంటి వివాదాస్పద పనులతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు అత్యంత దారుణంగా, డబుల్ మీనింగ్‌తో ఉన్నాయని, మహిళల ముందే అశ్లీల పాట పాడటం ఏమాత్రం సరికాదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

నేను లేచి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సింది..! చంద్రహాస్ గుంజి గుంజి పాట పై స్పందించిన జేడీ చక్రవర్తి
Chandrahas
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 9:49 PM

Share

నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా అడుగుపెట్టి సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. ప్రస్తుతం బారా బర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ లో చంద్రహాస్ స్టేజ్ పై ఓ పాట పాడాడు. ఆ పాట వివాదంగా మారింది. ఈ పాటలో అతను బూతులు వాడటంతో దుమారం రేగింది. చాలా మంది దీని పై విమర్శలు కురిపిస్తున్నారు. స్టేజ్ పై తన సినిమాలోని గుంజి గుంజి పాట పాడాడు. ఈ పాట పడుతున్నప్పుడు ఆ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన నటుడు జేడీ చక్రవర్తి ఆ సాంగ్ ను ఎంజాయ్ చేయడం పై కూడా విమర్శలు వస్తున్నాయి. దాంతో జేడీ చక్రవర్తి స్పందించారు. ఈమేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్‌ల కోసం కొత్త ప్రక్రియలను ఉపయోగించవచ్చని, అయితే ఇందుకోసం అసభ్యకరమైన పద్ధతులకు దిగజారాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్‌గా చూపించడమో, లిప్ లాక్ చేయడమో లేదా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ను ఉపయోగించడమో వంటివి సరైన ప్రచార పద్ధతులు కాదని జేడీ అన్నారు. ఇటీవల తాను కూడా అటువంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో ఒక ఈవెంట్‌లో భాగమయ్యానని, అప్పుడు అక్కడి నుండి లేచి వెళ్లిపోయి ఉండాల్సిందని జేడీ చక్రవర్తి అన్నారు.

సినిమా ప్రచారం కోసం మరింత వినూత్నమైన ఆలోచనలు అవసరమని జేడీ అన్నారు. దీనికి ఉదాహరణగా త్రీ ఇడియట్స్ సినిమా పబ్లిసిటీని ఆయన ప్రస్తావించారు. ఆ సినిమా ప్రచారంలో భాగంగా, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వృద్ధుడి గెటప్‌లో మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటిని బైయ్యనాక్యూలర్స్‌తో పరిశీలిస్తూ ఉన్నారన్న కంప్లైంట్ ఇవ్వగా.. సౌరవ్ గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆ వృద్ధుడిని పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు మీడియా మొత్తం అక్కడకు చేరుకుందని.. అందరూ చూస్తుండగానే ఆ వృద్ధుడు ఎవరో కాదు ఆమిర్ ఖాన్ అని రివీల్ అయ్యిందని. కేవలం నాలుగు రోజుల పాటు ఈ డిఫరెంట్ గెటప్‌లో కనిపించి, భారీ ప్రమోషన్ పొందారని జేడీ తెలిపారు. ఇది తెలివైన పబ్లిసిటీ విధానం అని జేడీ చక్రవర్తి అన్నారు. అసభ్యతకు పాల్పడకుండా, కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..