పని పూర్తి చేయాలంటూ.. 8 గంటల తర్వాత కంపెనీ నుంచి మెసేజ్.. తర్వాత
చనిపోయిన తర్వాత కూడా ఓ టెకీకి పని చేయాలంటూ కంపెనీ నుంచి మెసేజ్‌లు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చకు తెరలేపింది. చైనాలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న గావో అధిక పనిభారంతో గుండెపోటుతో 32 ఏళ్లకే ఇటీవల మృతి చెందాడు. అయితే అతడు చనిపోయిన 8 గంటల తర్వాత కూడా పని చేయాలంటూ కంపెనీ నుంచి మెసేజ్ రావడం తీవ్ర దుమారం రేపింది. చాలా మంది నెటిజన్లు చైనాలో పెరుగుతున్న ఓవర్ టైమ్ వర్క్ కల్చర్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీక్‌డేస్‌లో కూడా తన భర్త 9.30 తర్వాత ఇంటికి వచ్చేవారని గావో భార్య లీ తెలిపింది. అతడి ఆఫీసులో వర్క్‌లోడ్ చాలా ఎక్కువగా ఉండేదని.. అందుకే గావో తన టీమ్ సభ్యులతో కలిసి పనిచేసేవాడని అంది. అయితే తనకే గనుక సమయాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటే.. ఉద్యోగం మానేయాలని గావోపై ఒత్తిడి తీసుకువచ్చేదాన్నని కన్నీరుమున్నీరుగా విలపించింది. గావో చిన్నప్పటినుంచి కష్టాల మధ్య పెరిగాడని డబ్బుల కోసం చెత్త సేకరించేవాడని చెబుతున్నారు. గావో చేత చివరి శ్వాస వరకు పని చేయించుకుందని.. ఓవర్‌టైమ్ చేయించుకునే కంపెనీలు నాశనం అయిపోవాలని ఓ నెటిజన్ భావోద్వేగంతో శాపనార్థాలు పెట్టడం.. ఓవర్ టైమ్ కల్చర్ తీవ్రతకు అద్దం పడుతోంది. వాస్తవానికి చైనాలో రోజుకి 8 గంటలు.. వారానికి 44 గంటలు మాత్రమే పని చేయాలని కార్మిక చట్టాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..
ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..
లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్.. అంతలోనే
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

