ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఇద్దరు అమ్మాయిల ఫోటోలను విడుదల చేసింది బలూచ్ ఆర్మీ. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నది ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు 24 ఏళ్ళ అసిఫా మెంగల్‌గా గుర్తించారు. ఆమె జరిపిన ఆత్మాహుతి దాడిలో 17 మంది పాక్ భద్రతా సిబ్బందితో సహా సుమారు 50 మంది మరణించారు. బలూచ్‌లో దాడిని సీరియస్ గా తీసుకున్న పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే 140 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు 40 గంటల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది.
ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళలు పాల్గొన్నారని.. అసీఫ్ మెంగల్ అనే అమ్మాయి మహ్మద్ ఇస్మాయిల్ కుమార్తె అని.. బలూచిస్తాన్‌లోని నుష్కి నివాసి అని తెలిపింది బలూచ్ ఆర్మీ. అసీఫ్ మెంగల్ తన 21వ పుట్టినరోజున BLA లో చేరిందని… 2024లో ‘ఫిదాయీ’ అంటే ఆత్మాహుతి బాంబర్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. మరో యువతి హవా బలోచ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి ముందు అసీఫా మెంగల్ తన BLA సహచరులతో కలిసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నట్లు ఒక వీడియో సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో పాకిస్తాన్ ప్రభుత్వం .. అణిచివేతకు గురైన మహిళలపై మాత్రమే అధికారాన్ని ప్రదర్శిస్తోందని..తమను నేరుగా ఎదుర్కోలేదని..అందుకు వారి సామర్థ్యం సరిపోదని అసిఫా సవాలు చేసినట్లుగా ఉంది. వీడియోలో అసిఫా చేతిలో తుపాకీతో బిగ్గరగా నవ్వుతోంది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

