ఇక హైస్పీడ్ రైల్లో 2 గంటల్లో బెంగళూరుకు
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ని కనెక్ట్ చేస్తూ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఇకపై గంటల కొద్దీ ప్రయాణ భారంతో పనిలేకుండా చాలా తక్కువ సమయంలోనే మీరు అనుకున్న చోటుకు చేరుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ ద్వారా ప్రయాణ తీరు పూర్తిగా మారిపోబోతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లో, చెన్నైకు మూడు గంటల లోపు, అలాగే పూణేకు రెండు గంటల కన్నా తక్కువ సమయంలో చేరుకోవడం త్వరలోనే నిజం కాబోతోంది.
కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ లో కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించి, రైల్వే వ్యవస్థను మార్చే ఈ భారీ ప్లాన్ లో హైదరాబాద్ ఒక ముఖ్య కేంద్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. వీటి కోసం సుమారు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టులను 2047 నాటికి భారత్ ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఒకేసారి నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడు కొత్త కారిడార్లు దేశ రవాణా రంగ రూపురేఖలను పూర్తిగా మారుస్తాయని అన్నారు. హైదరాబాద్ కు బెంగళూరు, చెన్నై, పూణే నగరాలతో నేరుగా హై-స్పీడ్ రైల్ లింకులు ఏర్పడటం వల్ల పెద్ద మార్పు వస్తుంది. రైల్వే మినిస్ట్రీ ప్రకారం, హైదరాబాద్-బెంగళూరు ప్రయాణానికి రెండు గంటలు, హైదరాబాద్-చెన్నై కి రెండు గంటల 55 నిమిషాలు, పూణే-హైదరాబాద్ ప్రయాణానికి గంటా 55 నిమిషాలు పడుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

