AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tarakaratna: ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన మనోజ్‌.. నందమూరి ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన మంచువారబ్బాయి

మంచువారబ్బాయి మంచు మనోజ్‌ బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్న అతను తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నందమూరి హీరో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tarakaratna: ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన మనోజ్‌.. నందమూరి ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన మంచువారబ్బాయి
Manchu Manoj , Tarakaratna
Basha Shek
|

Updated on: Jan 29, 2023 | 8:10 PM

Share

ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పం వేదికగా నారా లోకేశ్‌ ప్రారంభించిన పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. కాగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే హీరో బాలకృష్ణతోపాటు.. చంద్రబాబు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకుని తమ సోదరుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా మంచువారబ్బాయి మంచు మనోజ్‌ బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్న అతను తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నందమూరి హీరో ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ట్వీట్టర్ వేదికగా ‘ ఆస్పత్రిలో తారకరత్నను చూశానని.. క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. తారకరత్న కోలుకుంటున్న తీరుపై వైద్యులు సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. తారకరత్న ఫైటర్‌ అని.. పూర్తిగా కోలుకొని త్వరలో వచ్చేస్తారని మంచు మనోజ్‌ ఆకాంక్షించారు.

మరోవైపు బెంగుళూరులోని నారాయణ హృదలయా ఆసుపత్రిలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారని.. తర్వలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే పాదయాత్రలో బిజీగా ఉంటోన్న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ‘మా బంధువు తారకరత్నతో నేను ఎప్పుడూ ఎంతో సన్నిహిత బంధాన్ని పంచుకున్నాను. అతను అలా తీవ్రమైన గుండెపోటుతో బాధపడడం చూసి నా గుండె పగిలిపోయింది. మేమిద్దరం ఇటీవలే కలుసుకున్నాం. జీవితం.. సినిమాలు.. రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం’ అని ఈ సందర్భంగా ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు లోకేశ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..