Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్యంపై మెగా మేనల్లుడు ఎమోషనల్‌.. త్వరగా కోలుకోవాలని తేజ్ ట్వీట్

తారకరత్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు బెంగళూరు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్యంపై మెగా మేనల్లుడు ఎమోషనల్‌.. త్వరగా కోలుకోవాలని తేజ్ ట్వీట్
Tarakaratna, Sai Dharam Tej
Follow us

|

Updated on: Jan 28, 2023 | 7:35 PM

నారా లోకేశ్‌ యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలారు ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తారకరత్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు బెంగళూరు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు బెంగళూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా సినీ ప్రముఖులు తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈక్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నందమూరి హీరో ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ఆశిస‍్తున్నా. మా ప్రార్థనలు మీకు ఎప్పుడు అండగా ఉంటాయి ‘ అని పోస్ట్ చేశాడు సాయిధరమ్ తేజ్‌.

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తారకరత్న త్వరగా కోలుకోని తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తారకరత్న త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నాం కావలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?