Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. ఆ సమయంలో చిరంజీవి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు: గుమ్మడి కూతురు శారద

చిరంజీవి ఇంత అభిమానం సంపాదించుకున్నారంటే దానికి కారణం సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా. అందులోనూ ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ అంటూ ఎంతోమందికి రక్తదానం, నేత్రదానం చేసిన ఆయన సినీ కార్మికుల కోసం తనవంతూ పాటు పడుతున్నారు.

Chiranjeevi: దటీజ్‌ మెగాస్టార్‌.. ఆ సమయంలో చిరంజీవి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు: గుమ్మడి కూతురు శారద
Chiranjeevi, Gummadi Sarada
Follow us

|

Updated on: Jan 28, 2023 | 9:01 PM

మెగాస్టార్‌ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎలాంటి బ్యా గ్రౌండ్‌ లేకుండా స్టార్‌ హీరోగా ఎదిగిన ఆయనకు అశేష అభిమాన గణం ఉంది. ఎంతోమంది యువనటులు మెగాస్టార్‌నే ఆదర్శంగా తీసుకుని సినిమాల్లో రాణిస్తున్నారు. చిరంజీవి ఇంత అభిమానం సంపాదించుకున్నారంటే దానికి కారణం సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా. అందులోనూ ఆయన చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ అంటూ ఎంతోమందికి రక్తదానం, నేత్రదానం చేసిన ఆయన సినీ కార్మికుల కోసం తనవంతూ పాటు పడుతున్నారు. కానీ చిరంజీవి చేసిన దానాలు, సహాయాలు పెద్దగా ప్రచారంలోకి రావు. అయితే అప్పుడప్పుడు ఆయన సాయం పొందిన వారు మీడియా ముందుకు వస్తుంటారు. చిరంజీవి వల్ల తమకు ఒనగూరిన ప్రయోజనాలపై పెదవి విప్పుతుంటారు. అలా తాజాగా దిగ్గజ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు కూతురు గుమ్మడి శారద చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక విషయంలో చిరంజీవి ఆపద్బంధవుడిలా ఆదుకున్నారంటూ ఎమోషనల్‌ అయ్యారు.

‘ఇది 2014లో జరిగిన విషయం. మా ఊళ్లో ఒక రామాలయం ఉండేది. మా ముత్తాతల్లో ఒకరు ఈ ఆలయాన్ని కట్టించారు. అయితే కాలక్రమేణా ఆ గుడి రోడ్డు కన్నా కిందకు వెళ్లిపోయింది. వర్షాకాలంలో గుడిలో నీళ్లు చేరి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ గుడిని బాగు చేయాలని మా అమ్మ గారి ఆఖరి కోరిక. అయితే అది తీరకుండానే అమ్మ కన్నుమూశారు. ఈనేపథ్యంలో మా ఊరికి గుడి మంజూరు చేయండి అని చాలామంది దగ్గరకు ఫైల్‌ పట్టుకుని వెళ్లాను. ఎవరూ పట్టించుకున్నా పాపాన పోలేదు. అయితే చిరంజీవిని కలిస్తే పనవుతుందని తెలిసి.. ఆయనను వెళ్లి కలిశాను. గుడికి సంబంధించి అన్ని విషయాలు ఆయనతో చెప్పాను. అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలింది. గుడిని బాగుచేసేందుకు చిరంజీవి చర్యలు తీసుకున్నారు. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయమేమిటంటే.. 2014 నాటికి చిరంజీవి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. అయినా తనకున్న పలుకుబడితో గుడి నిర్మాణ పనులకు కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు’ అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు గుమ్మడి శారద.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..