- Telugu News Photo Gallery Cinema photos Actress Anupama Parameswaran Shares Emotional note About 18 Pages Movie And Her Role Nandini telugu cinema news
Anupama Parameswaran: ‘ఆమెతో అలా నా ప్రయాణం మొదలైంది’.. అనుపమ జీవితంలో ‘నందిని’ ప్రత్యేకం..
అఆ సినిమాతో తెలుగు పరిచయమైంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల కార్తికేయ 2, 18 పేజిస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
Updated on: Jan 28, 2023 | 8:17 PM

అఆ సినిమాతో తెలుగు పరిచయమైంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల కార్తికేయ 2, 18 పేజిస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.

కార్తికేయ 2తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వచ్చిన 18 పేజెస్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా కనిపించారు. థియేటర్లలో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో అలరిస్తోంది.

ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు ఆహా.. నెట్ ఫ్లిక్స్ లో 18 పేజెస్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇటు ఓటీటీలోనూ మంచి రెస్పా్న్స్ అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఈ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది.

" ఇలా నేను ఆమెతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను..అందుకు నేను పెద్దగా ఏం చేయలేదు.. మా అమ్మ పాత చెవి కమ్మలు పెట్టుకున్నాను.. నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో వార్షిక రోజు వేడుకలో నాకోసం కొనగోలు చేసిన ముక్కు పుడకను పెట్టుకున్నాను. "

"ఆ తర్వాత నల్లటి పాతదారం.. చిందరవందరగా ఉన్న జుట్టు.. ఒక పుస్తకం.. అంతే.. ఫస్ట్ ఫోటో వెంటనే దర్శకుడికి పంపాను. వెంటనే అతను మా నందిని దొరికేసింది అని చెప్పాడు. ఇక అలా సినిమా మొత్తం కొనసాగింది." అంటూ రాసుకొచ్చింది.

తనకు నందిని చాలా ప్రత్యేకమని.. ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తర్వాత తనకు సోషల్ మీడియాలో ఆపారమైన ప్రేమను అందుకుంటున్నానని తెలిపారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలినని.. 18 పేజెస్ చిత్రాన్ని చూడాలంటూ కోరింది.

ప్రస్తుతం అనుపమ డీజె టిల్లు సిక్వెల్ లో నటిస్తోంది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ చిత్రంలో నటిస్తున్నారు.





























