- Telugu News Photo Gallery Cricket photos Ahead of ICC Women's Under 19 T20 World Cup final captain Shafali Verma says that she is focusing to win Trophy
నాన్న కలను నిజం చేయాలనుకుంటున్నా.. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ షెఫాలీ వర్మ
2020లో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ సమయంలో నిరాశలో ఉన్న షెఫాలీ తండ్రి ఆమెతో 'మరిన్ని అవకాశాలు వస్తాయి' అని చెప్పుకొచ్చారు. ఈసారి ఎలాగైనా తన తండ్రి కలను నెరవేరుస్తానంటోందీ డ్యాషింగ్ ఓపెనర్.
Updated on: Jan 28, 2023 | 8:03 PM

Shafali Verma

.భారత సీనియర్ మహిళల జట్టులో క్రీడాకారిణి అయిన షఫాలీ వర్మ శనివారం (జనవరి 28) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఆదివారం U-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్. అండర్-19 మహిళల ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి. టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌లో ట్రోఫీని గెలుచుకోవాలని షెఫాలీ టీం తహతహలాడుతోంది.

U-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్త టోర్నమెంట్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపేంఉదకు షెఫాలీ సిద్ధంగా ఉంది. మెగా ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి.

షెఫాలీ వర్మ 15 ఏళ్ల వయసులో సీనియర్ జట్టులో అరంగేట్రం చేసింది. షెఫాలీ దేశం తరఫున మూడు ఫార్మాట్లలో ఆడింది.