Telugu News » Photo gallery » Cricket photos » Ind vs aus australia player glenn maxwell disappointed missing india test series due to injury australian team
IND vs AUS: కెరీర్‌లో ఏకైక సెంచరీ.. అది కూడా భారత్‌లోనే.. కట్‌చేస్తే.. ప్రమాదంలో స్టార్ ప్లేయర్ కెరీర్.. ఎవరంటే?
Venkata Chari |
Updated on: Jan 29, 2023 | 8:12 AM
India vs Australia Test Career: చివరిసారిగా 2017లో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు తరపున ఈ స్టార్ ఆటగాడు అద్భుత సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఏకైక సెంచరీ.
Jan 29, 2023 | 8:12 AM
Glenn Maxwell: ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా ఇందులో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అందరికీ ఈ అవకాశం లభించదు. వారిలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఈ అవకాశాన్ని చేజార్చుకుని నిరాశకు గురయ్యాడు.
1 / 5
నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ జారిపడి కాలికి గాయమైంది. అప్పటి నుంచి క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉంటూ భారత పర్యటనకు కూడా రాలేకపోయాడు.
2 / 5
మాక్స్‌వెల్ టెస్టు జట్టులో భాగం కానప్పటికీ, గాయం కారణంగా తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతను నిరాశకు గురయ్యాడు. 'బిగ్ బాష్ లీగ్' కామెంటరీ సందర్భంగా మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. "బహుశా ఇది నా జీవితమంతా నష్టపోతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
3 / 5
మాక్స్‌వెల్ తన జట్టును పటిష్టంగా అభివర్ణిస్తూ, “ముఖ్యంగా (భారత్‌లో) నా సహచరుల ఆటను చూసే అవకాశం లభించడం విశేషం. భారత పర్యటనకు ఉత్తమమైన జట్టును వారు పొందారని నేను భావిస్తున్నాను" అంటూ తెలిపాడు.
4 / 5
టెస్ట్ క్రికెట్‌లో మాక్స్‌వెల్ కెరీర్ చాలా చిన్నది. అతను కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే, అతని ఏకైక టెస్ట్ సెంచరీ భారత జట్టుపై చేశాడు. చివరిసారిగా 2017లో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు తరపున రాంచీ టెస్టులో మ్యాక్స్‌వెల్ 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ వన్డే సిరీస్‌కు తిరిగి రావచ్చని అంతా భావిస్తున్నారు.