- Telugu News Photo Gallery Cricket photos Ilt20 league australia bowler adam zampa took 3 wickets dubai capitals lost against desert vipers
T20 Cricket: జట్టులో ఎంపిక చేయలేదు.. రిటైర్మెంట్‌కు ప్లాన్ చేశాడు.. కట్‌చేస్తే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్..
జట్టు ఓటమి పాలైనప్పటికీ, 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Updated on: Jan 29, 2023 | 9:50 AM

టీమ్‌లో సెలెక్ట్ అవుతామని ఆశించడం, ఆ తర్వాత సెలెక్ట్ కాకపోవడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. పదేపదే ఇలానే జరిగితే రిటైర్ కావాలనే ఆలోచనలు చేస్తుంటారు ఆటగాళ్లు. అటువంటి పరిస్థితుల నుంచి తిరిగి వచ్చి, పటిష్టంగా రాణించిన కొంతమంది ప్లేయర్లు తమ సత్తాను సెలక్టర్లకు చూపిస్తుంటారు. ఇంకా తమలో ఆడే సత్తా ఉందని చెబుతుంటారు. ఆస్ట్రేలియా స్టార్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా కెరీర్‌లోనూ ఇలానే జరిగింది.

UAEలో జరుగుతున్న ILT20 లీగ్‌లో జంపా అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ, అతని జట్టు దుబాయ్ క్యాపిటల్స్ గెలవలేకపోయింది.

జంపా అద్బుతమైన బౌలింగ్ ముందు డెసర్ట్ వైపర్స్ జట్టు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. జంపా తన 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జంపా తన ఓవర్లలో ఒక్క ఫోర్, సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం.

అయినప్పటికీ, అతని జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోలేక 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, జంపా తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

గత కొన్ని రోజులుగా జంపాకు అంతగా అనుకూలంగా లేదు. భారత పర్యటనలో టెస్టు సిరీస్‌కు వచ్చే ఆస్ట్రేలియా జట్టులో అతనికి చోటు దక్కలేదు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న జంపా, ఆ తర్వాత నిరాశ చెందాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించే ఆలోచన చేస్తానని ప్రకటించాడు.





























