Telugu News » Photo gallery » Cricket photos » From Ricky Ponting to Rohit Sharma check these 5 skippers who won 50 plus matches out of first 75 matches as a captain
Best Skippers: టాప్ 5 కెప్టెన్లలో భారత్ నుంచే ఇద్దరు.. లిస్టులో ధోనికి నో ప్లేస్.. ఎందుకో తెలుసా?
Venkata Chari |
Updated on: Jan 29, 2023 | 1:50 PM
అయితే, కెప్టెన్ సామర్ధ్యం అతని జట్టు గెలిచిన మ్యాచ్‌లు, టోర్నమెంట్‌ల సంఖ్యను బట్టి నిర్ణయింస్తుంటారు. ఈ క్రమంలో మొదటి 75 మ్యాచ్‌లలో 50 లేదా 50 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన 5గురు సారథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Jan 29, 2023 | 1:50 PM
క్రికెట్ జట్టుకు సారథిగా ఉండాలంటే అన్ని రంగాల్లో సత్తా చూపాల్సి ఉంటుంది. జట్టుతో పాటు మ్యాచ్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను సమయానుకూలంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓటమి ఎదురయ్యేప్పుడు కూడా తన నిర్ణయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే, ప్రతిదానికీ అతను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
1 / 7
తన వద్ద ఉన్న వనరులను సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే సారథిగా అగ్రస్థానంలో ఉంటాడు. అలాంటి వారిలో ఎంతోమంది ఉత్తమ సారథులుగా తమ పేరును లిఖించుకున్నారు. అయితే, కెప్టెన్ సామర్ధ్యం అతని జట్టు గెలిచిన మ్యాచ్‌లు, టోర్నమెంట్‌ల సంఖ్యను బట్టి నిర్ణయింస్తుంటారు. ఈ క్రమంలో మొదటి 75 మ్యాచ్‌లలో 50 లేదా 50 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన 5గురు సారథుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
2 / 7
1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 59 మ్యాచ్‌లు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 1995లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి 2012 వరకు దేశం తరపున ఆడాడు. అతను 2002 నుంచి 2011 వరకు వన్డేలు, 2004 నుంచి 2011 వరకు టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాడు. పాంటింగ్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. 67.91 శాతం విజయాలతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో (324 మ్యాచ్‌లలో 220 విజయాలు) టాప్ ప్లేస్‌లో నిలిచాడు. పాంటింగ్ మొదటి 75 మ్యాచ్‌లలో 59 గెలిచిన కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.
3 / 7
2. రోహిత్ శర్మ (భారత్) - 58 మ్యాచ్‌లు: భారత జట్టు ప్రస్తుత కెప్టెన్, అత్యుత్తమ ఓపెనర్‌లలో ఒకరిగా పేరుగాంచిన రోహిత్ శర్మ.. 2007లో వైట్ బాల్ క్రికెట్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే రెడ్ బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి 2013 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 5 టైటిల్ విజయాలతో ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. డిసెంబర్ 2021 లో వన్డే, టీ20ఐ జట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ తరువాత టెస్ట్ ఫార్మాట్‌లో కూడా విరాట్ కోహ్లీని భర్తీ చేశాడు. కెప్టెన్‌గా 75 మ్యాచ్‌లు ఆడగా 58 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
4 / 7
5 / 7
4. సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్) - 53 మ్యాచ్‌లు: పాకిస్థాన్ క్రికెటర్ 2007లో వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2010లో టెస్టులు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్ అన్ని ఫార్మాట్లలో పాకిస్తానీ జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా తన మొదటి 75 మ్యాచ్‌లలో 53 గెలిచి, ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచాడు.
6 / 7
5. హాన్సీ క్రోంజే (దక్షిణాఫ్రికా) - 52 మ్యాచ్‌లు: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హాన్సీ క్రోంజే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉండడంతో 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు. అయితే, 2002లో విమాన ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, 1990లలో దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా మొదటి 75 మ్యాచ్‌లలో 52 గెలిచిన క్రోంజే.. ఈ లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు.