Basha Shek |
Updated on: Jan 29, 2023 | 4:00 PM
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 5.15 గంటలకు దక్షిణాఫ్రికాలోని పోచ్‌స్ట్రూమ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
షెఫాలీ వర్మ నేతృత్వంలోని భారత్, ఇంగ్లండ్ వరల్డ్ కప్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.కాగా మ్యాచ్‌కు ముందు టీమిండియా మహిళల జట్టును ఒలింపియన్.. భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కలుసుకున్నాడు.
ఈ నేపథ్యంలో వారితో సరదాగా గడిపిన నీరజ్ అమ్మాయిలకు తన విలువైన సూచనలు ఇచ్చాడు. వారిలో స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసుకుంది.
కాగా ప్రపంచకప్ ఫైనల్‌కు ఒక రోజు ముందు జనవరి 28న భారత కెప్టెన్ షెఫాలీ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్‌లో కూడా నీరజ్ చోప్రా కనిపించింది.
నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించాడు. ఫైనల్లో అతను 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.