- Telugu News Photo Gallery Cricket photos PM Narendra Modi BCCI Virat Kohli Rohit Sharma Congratulates Women U19 T 20 World Cup Winner Indian Team
Team India: ఈ విజయం భావి తరాలకు స్ఫూర్తి.. ప్రపంచ ఛాంపియన్లకు ప్రధాని మోడీ అభినందనలు.. బీసీసీఐ భారీ నజరానా
దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
Updated on: Jan 29, 2023 | 10:03 PM

దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది.

భారత అమ్మాయిలు సాధించిన విజయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, టీమిండయా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భారత అమ్మాయిలకు అభినందనలు తెలిపారు.

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. మీరు అద్భుతమైన క్రికెట్ ఆడారు. మీ విజయం భావితరాలకు మరింత స్ఫూర్తినివ్వాలి' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

'భారత్‌లో మహిళా క్రికెట్ పురోగమనంలో ఉంది. మహిళల క్రికెట్ ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానా ప్రకటిస్తున్నాం' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు బీసీసీఐ కార్యదర్శి జైషా.

అంతేకాదు భారత అమ్మాయిలు స్వదేశానికి రాగానే ఘనంగా సత్కరిస్తామని జైషా ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అహ్మద్‌బాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జట్టు సభ్యులందరినీ ఘనంగా సత్కరిస్తామని జైషా పేర్కొన్నారు.

అండర్ 19 మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.





























