AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli Sandadi: శ్రీకాంత్ ‘సౌందర్య లహారి’ ఇప్పుడేలా ఉందో తెలుసా?.. పెళ్లి సందడి హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ముఖ్యంగా అప్పట్లో కుర్రాళ్ల స్వప్న సుందరిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరోయిన్ దీప్తి భట్నాగర్. ఇందులో సౌందర్య లహరి.. స్వప్న సుందరి పాటలో ఆమె గ్లామర్ చూసి అప్పట్లో హీరోయిన్స్ సైతం అసూయ పడ్డారట. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది దీప్తి.

Pelli Sandadi: శ్రీకాంత్ 'సౌందర్య లహారి' ఇప్పుడేలా ఉందో తెలుసా?.. పెళ్లి సందడి హీరోయిన్ ఏం చేస్తుందంటే..
Pelli Sandadi
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2023 | 7:34 PM

Share

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో పెళ్లి సందడి ఒకటి. 1996లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కుటుంబప్రేమకథ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాను అల్లు అరవింద్, అశ్వనీ దత్ కలిసి నిర్మించగా…సంగీత దర్శకుడు కీరవాణి అందించిన పాటలు ఇప్పటికీ ప్రజల హృదయాలను తాకుతుంటాయి. ఇందులో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో వీరి ముగ్గురి కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ముఖ్యంగా అప్పట్లో కుర్రాళ్ల స్వప్న సుందరిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరోయిన్ దీప్తి భట్నాగర్. ఇందులో సౌందర్య లహరి.. స్వప్న సుందరి పాటలో ఆమె గ్లామర్ చూసి అప్పట్లో హీరోయిన్స్ సైతం అసూయ పడ్డారట. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది దీప్తి.

అక్కినేని నాగార్జునతో ఆటో డ్రైవర్.. బాలకృష్ణతో సుల్తాన్, మోహన్ బాబుతో కొండవీటి సింహాసనం, రాజశేఖర్ తో మా అన్నయ్య వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఏవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది దీప్తి. అదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ రణదీప్ ఆర్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

ఇవి కూడా చదవండి

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు దీప్తి. తన పూర్తి సమయాన్ని కుటుంబాన్ని చూసుకున్నారు. అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు దీప్తి. ఎప్పుడూ తన లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామీలీ విషయాలను పంచుకుంటారు. అంతేకాదు.. నెట్టింట గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు. 50 ఏళ్ల వయసులోనూ ఇప్పటీ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా కనిపిస్తుంటారు దీప్తి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.