Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhire Abhi: జబర్దస్త్‏కు ఎవరి దిష్టి తగిలిందో.. మాకు మేమే తిట్టుకుంటున్నాం.. అదిరే అభి వైరల్ పోస్ట్..

అందర్నీ నవ్వించే షోకు .. మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండూ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. గతంలో జబర్దస్త్ టీం అంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లమని.. ఇప్పుడు ఎవరి దారి వారికి అయ్యిందని..కష్టం ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదంటూ

Adhire Abhi: జబర్దస్త్‏కు ఎవరి దిష్టి తగిలిందో.. మాకు మేమే తిట్టుకుంటున్నాం.. అదిరే అభి వైరల్ పోస్ట్..
Abhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 29, 2023 | 7:00 PM

బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోకు ఉండే ఆదరణ గురించి చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. జడ్జీలు.. కంటెస్టెంట్స్ మారడం.. కొత్త వాళ్లు రావడం జరిగినా.. ఈ షో క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. అయితే తాజాగా జబర్దస్త్ షోకు దిష్టి తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఒక మాట అన్నా పడని మేము.. ఇప్పుడు మాకు మేమే తిట్టుకుంటున్నాము.. అందర్నీ నవ్వించే షోకు .. మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండూ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. గతంలో జబర్దస్త్ టీం అంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లమని.. ఇప్పుడు ఎవరి దారి వారికి అయ్యిందని..కష్టం ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదంటూ భావోద్వాగానికి గురయ్యారు. ప్రస్తుతం అభి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

“జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు.. టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు.. కామెడీని అవపోసన పట్టిన కంటెస్టెంట్లు.. అందరికీ అన్నంపెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇవి కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.. సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్న హస్తాలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మీల అందం, స్కిట్ల మాయాజాలం. స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్లు, అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు.

Adhire Abhi

Adhire Abhi

ఎవరి దిష్టి తగిలిందో.. ఏకతాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిది అయ్యింది. ఎవడైనా పల్లెత్తి మాటంటే పడని మేము .. మమ్మల్ని మేమే మాటలు అనుకుంటున్నాం. సమయం వెనక్కెళ్లితే బాగుండు. ఆరోజులు తిరిగి వస్తే బాగుండు. అందర్నీ నవ్వించే జబర్దస్త్ కు మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండు . ” అంటూ ఓ నోట్ షేర్ చేశారు అభి. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.