కర్నూలులో జాతీయ రహదారిపై ఆటో డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్, స్టంట్స్‌తో వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ముగ్గురు డ్రైవర్లను అరెస్టు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.