బంగారు నగలపై GST ఎంత? గోల్డ్ ధరల పతనానికి కారణమేంటి?
2026 బడ్జెట్‌లో క్యాన్సర్ ఔషధాలు, సీఫుడ్ ఇలా కొన్నింటిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం లేదా మినహాయించడంతో వీటి ధరలు తగ్గనున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత అవసరాలు కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాల్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. దీంతో బంగారంపైనా దిగుమతి సుంకాలు తగ్గాయని.. అందుకే బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయన్నది కొందరు అనుకుంటున్నారు. కానీ, నిజానికి అలాంటిదేం లేదు.
2026 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం అది 6 శాతంగానే కొనసాగుతుంది. దీంట్లో 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా ఒక శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ AIDC. ఇక వెండి దిగుమతులపైనా భారతీయ నివాసితులకు 6 శాతం దిగుమతి సుంకం ఉండగా.. మిగతా వారికి 36 శాతం వర్తిస్తుంది. గతంలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాల్ని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించినా.. ఈసారి బడ్జెట్‌లో మాత్రం అలాంటిదేమీ చేయలేదు. కనుకు బంగారం, వెండి ధరల పతనం వెనక కేవలం అంతర్జాతీయ పరిణామాలే ఉన్నాయని అర్థంచేసుకోవాల్సి ఉంది. ఇతర పన్నుల విషయానికి వస్తే.. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు భారత ప్రభుత్వం నుంచి GST వర్తిస్తుంది. ప్రస్తుతం బంగారు ఆభరణాలు, 24 క్యారెట్ల బంగారం, గోల్డ్ కాయిన్స్, బార్స్ అన్నింటిపైనా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇక్కడ ఫైనల్ బిల్లుపై ఇది కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఆభరణాల్లో మాత్రం.. మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్!
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

