43 ఏళ్ల వయసులో ప్రియాంక అరాచకం.. డైట్ సీక్రెట్ ఇదేనట.
Rajitha Chanti
Pic credit - Instagram
04 February 2026
ప్రియాంక చోప్రా.. ప్రపంచవ్యాపంగా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలోనే అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. అక్కడే వరుస సినిమాలు చేస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు జోడిగా వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఈక్రమంలోనే 43 ఏళ్ల వయసులో తన అందం, ఫిట్నెస్ గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.
ప్రియాంక ప్రతిరోజూ దాదాపు గంటపాటు యోగా, జిమ్ వ్యాయమం చేస్తుంది. అలాగే శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచేందుకు కఠిన వ్యాయమాలు చేస్తుందట.
తనకు ప్రత్యేకంగా డైట్ ఏమీ లేదని.. స్వీట్స్ సైతం తింటానని తెలిపింది. కానీ సలాడ్, ప్రోటీన్, సూప్ వంటి ఆహారాలను అధికంగా తీసుకుంటుందట.
పిజ్జాలు, బర్గర్లు, బఫెలో వింగ్స్ తినడం చాలా ఇష్టమని అంటుంది. ప్రతిరోజూ తాను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని..స్నాక్స్ సైతం తీసుకుంటుదట.
రోజువారీ ఆహారంలో చపాతీ, కూరగాయలు, సూప్‌లు, సలాడ్‌లు, అన్నం, పప్పు, పండ్లు తీసుకుంటానని.. అలాగే జ్యూస్ కూడా తీసుకుంటానని అంటుంది.
ప్రతిరోజూ కనీసం 10 గ్లాసుల నీరు అంటే దాదాపు 2 లీటర్ల వాటర్ తీసుకుంటానని తెలిపింది. హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యమని అంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్