రాజా సాబ్ బ్యూటీ క్యూట్ ఫొటోలతోనే కట్టిపడేస్తుంది

Rajeev 

4 February 2026

తెలుగు సినిమా లవర్ (2018) లో తొలిసారిగా నటించింది రిద్ధి కుమార్. తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. 

ఆ తర్వాత ఆమె మలయాళంలో ప్రణయ మీనుకలుడే కాదల్ (2019), దండం (2019) తో మరాఠీ చిత్రసీమలోనూ అరంగేట్రం చేసింది.

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి పలు అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ పూణే , ఫేస్‌ ఆఫ్‌ ఇండియా వంటి అనేక టైటిల్స్‌ను ఆమె గెలుచుకుంది.

లవర్ సినిమా తర్వాత అనగనగా ఓ ప్రేమకథ సినిమాల్లో ఆమె నటించింది.  కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. 

ఆ తర్వాత రాధే శ్యామ్‌లో ప్రభాస్‌తో కలిసి నటించింది. రాధే శ్యామ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది 

ఇక ఇటీవల విడుదలైన ప్రభాస్ రాజా సాబ్ సినిమాలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. రాజా సాబ్ సినిమాలో తన అందంతో కవ్వించింది. 

ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. ఈ బ్యూటీ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.