Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైటిల్‌ పోరులో టాప్‌ స్కోరర్‌గా తెలుగమ్మాయి.. టీమిండియా వరల్డ్ కప్ విక్టరీలో కీ రోల్‌ పోషించిన గొంగడి త్రిష

ఈ విజయంలో తెలుగమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది. 69 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 3 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అయితే త్రిష

టైటిల్‌ పోరులో టాప్‌ స్కోరర్‌గా తెలుగమ్మాయి.. టీమిండియా వరల్డ్ కప్ విక్టరీలో  కీ రోల్‌ పోషించిన గొంగడి త్రిష
Telangana's Gongadi Trisha
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 6:46 AM

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది. కాగా ఈ విజయంలో తెలుగమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది. 69 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 3 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అయితే త్రిష మాత్రం నిలకడగా ఆడింది. స్పల్ప స్కోరు కావడంతో ఆచితూచి ఆడింది. మొత్తం 29 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అంతేకాదు హ్రిషిత బసుతో కలిసి మూడో వికెట్‌ను కీలకమైన 46 పరుగులను జోడించింది. అంతకుముందు ఫీల్డింగ్‌లో ఓ చురుకైన క్యాచ్‌ను పట్టి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ గ్రేస్ స్క్రివెన్స్‌ను పెవిలియన్‌ పంపించింది. కాగా గ్రేస్‌ ప్రపంచకప్‌ టోర్నీలో పరుగుల వర్షం కురిపిస్తోంది. టోర్నీ మొత్తం ఆద్యంతం రాణించడంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డుకు ఎంపికైంది. అలాంటి గ్రేస్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ పంపించింది త్రిష. కాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రపంచకప్‌ టోర్నీలో నిలకడగా రాణించింది.

గ్రూప్‌ దశలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్లో గొంగడి త్రిష(51 బంతుల్లో 57, 6ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలిపించింది. కాగా టీమిండియా జగజ్జేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తూ పలువురు పోస్టులు షేర్‌ చేస్తున్నారు. కాగా ఎనిమిదేళ్ల వయసులోనే అండర్-16లో సత్తా చాటిన త్రిష 12 ఏళ్ల వయసులో రాష్ట్ర అండర్ -19 జట్టుకు ఆడింది. ఆతర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..