Early Aging: ఈ అలవాట్లతో త్వరగా ముసలివారైపోతారు.. వదిలించుకోకపోతే అంతే సంగతులు

ముదురు మచ్చలు, ముడతలు, పొడిబారడం. ఇది కాకుండా, ఛాతీ చుట్టూ హైపర్పిగ్మెంటేషన్, తరచుగా జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లగా మారిపోవడం.. ఇవి అకాల వృద్ధాప్యం లక్షణాలు.

Early Aging: ఈ అలవాట్లతో త్వరగా ముసలివారైపోతారు.. వదిలించుకోకపోతే అంతే సంగతులు
Early Aging
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 7:32 AM

మన అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మనం తినే ఆహారం, పాటించే జీవనశైలి మన భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. అందుకే జీవితంలో మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. క్రమశిక్షణతో ముందుకు సాగాలంటారు పెద్దలు. అయితే దైనందిన జీవితంలో తరచూ చేసే కొన్ని పనులు మనల్ని తొందరగా వృద్దాప్యంలోకి నెట్టేస్తాయి. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత వృద్ధులు అవుతారు. కానీ సమయం కంటే ముందు శరీరం, చర్మంపై వయస్సు సంకేతాలను చూపించడాన్ని అకాల వృద్ధాప్యం అంటారు. ముదురు మచ్చలు, ముడతలు, పొడిబారడం. ఇది కాకుండా, ఛాతీ చుట్టూ హైపర్పిగ్మెంటేషన్, తరచుగా జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లగా మారిపోవడం.. ఇవి అకాల వృద్ధాప్యం లక్షణాలు. కాగా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, దానిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.అందుకోసం చాలామంది తరచుగా ముఖం శుభ్రం చేసుకుంటుంటారు. అయితే ఈ అలవాటు కూడా అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. దీని కారణంగా, చర్మం దాని సహజ మెరుపును కోల్పోతుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం, ముడతలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మార్నింగ్‌ వాక్‌..

అతిసర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు అతిగా చేస్తే ఏదైనా అనర్థమే.. శారీరక వ్యాయామం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఉదయాన్నే పరుగెత్తడం వల్ల మనస్సు, ఆరోగ్యం రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ARO మెడికల్ కంటెంట్ ఎడ్యుకేషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువగా నడవడం వల్ల వాపు తదితర సమస్యలు వస్తాయి.

సన్‌బ్లాక్‌..

చర్మ సమస్యలను నివారించడానికి సన్‌బ్లాక్ ఉత్తమ ఎంపిక. దీని ఉపయోగం చర్మ క్యాన్సర్, ఫోటోగింగ్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. అయితే అధిక సన్‌బ్లాక్‌ వినియోగం విటమిన్ డి లోపానికి కారణమవుతుంది. దీని ఫలితంగా ముఖంలో మెరుపు మాయమైపోతుంది.

ఇవి కూడా చదవండి

కాఫీ..

కాఫీ ఎక్కువగా తాగ కూడదు. దీనివల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడి బారిపోయి తొందరగా ముడతలు పడటానికి సహాయపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్‌ను మితంగా కాకుండా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఫైబర్‌ స్థాయి పూర్తిగా పడిపోతుంది.

ఇవి కూడా..

వీటితో పాటు ఆల్కహాల్‌‌కి దూరంగా ఉండాలి. కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన చర్మం అంత అందంగా ఉంటుంది. కాలేయం బాగా పనిచేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళి మీ చర్మం ఎంతో కాంతి వంతంగా మెరుస్తుంది. స్వీట్లు వృద్దాప్యంలోకి నెట్టేయడంలో ముందుంటాయట. వీటివల్ల శరీరంలో గ్లెకేషన్‌ అనే ప్రక్రియ మొదలై శరీరంలోని కణాలు ప్రోటీన్లను గ్రహించడం మానేస్తాయట. ఆ కారణం వల్ల కణాలు రోజురోజుకి బలహీనపడి తొందరగా వృద్ధాప్యం రావడానికి కారణమవుతుంది. కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త కణాలు డైల్యూట్‌ అయిపోయి చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తాయి. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల తొందరగా ముడతలు రావడానికి దోహదపడతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!