కూతురి క్రికెట్ కెరీర్ కోసం తండ్రి సర్వస్వం త్యాగం.. కట్ చేస్తే.. ప్రపంచకప్ ట్రోఫీతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలుగమ్మాయి

టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీ రోల్‌ పోషించిన త్రిషపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇక త్రిష సొంతూరైన భద్రాచలంలో అయితే అంబరాలు సంబరాన్నంటాయి. ఫైనల్‌ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షిస్తూ ఆస్వాదించారు.

కూతురి క్రికెట్ కెరీర్ కోసం తండ్రి సర్వస్వం త్యాగం.. కట్ చేస్తే.. ప్రపంచకప్ ట్రోఫీతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన తెలుగమ్మాయి
Gongadi Trisha
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 12:45 PM

గొంగడి త్రిష.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్మొగుతున్న పేరు. భద్రాచలం ప్రాంతానికి చెందిన ఈ 17 ఏళ్ల అమ్మాయి అండర్‌ – 19 టీ20 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సందర్భాల్లో బౌలింగ్‌లోనూ రాణించి టీమిండియా వరల్డ్‌కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 24 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచింది. లక్ష్యం తేలికే అయినా ఓపెనర్లు త్వరగా ఔట్‌ కావడం, దీనికి తోడు విపరీతమైన ఒత్తిడి మధ్య పిచ్‌ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా నిలకడగా ఆడిందీ తెలుగమ్మాయి. తుదికంటా క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను చురుకైన క్యాచ్‌తో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది త్రిష. అందులో స్కాట్లాండ్‌పై మెరుపు అర్ధశతకమూ ఉంది. కాగా టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీ రోల్‌ పోషించిన త్రిషపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇక త్రిష సొంతూరైన భద్రాచలంలో అయితే అంబరాలు సంబరాన్నంటాయి. ఫైనల్‌ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షిస్తూ ఆస్వాదించారు. గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు.

అన్నీ వదిలేసుకుని..

ఇక త్రిష తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా కూతురు క్రికెట్‌ కోసం ఎంతో పాటుపడిన తండ్రి రామిరెడ్డి తన బిడ్డను చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. కాగా త్రిష బాల్యం మిగిలిన పిల్లల కంటే చాలా భిన్నంగా గడిచింది. రెండేళ్ల నుంచి ఆమె తండ్రి ఇంట్లో కార్టూన్లు చూడటం నిషేధించారు. కూతురును క్రికెటర్‌గా చూడాలనుకున్న ఆయన కేవలం క్రికెట్‌ మ్యాచ్‌లు మాత్రమే చూడాలని బిడ్డను ఆదేశించాడు. ఇక రోజూ తండ్రితో కలిసి జిమ్‌కు వెళ్లేదట త్రిష. అక్కడ క్రికెట్‌ ప్రాక్టీస్ చేసేదట. గొంగడి రామిరెడ్డి స్వతహాగా హాకీ క్రీడాకారుడు. అయితే కొన్ని కారణాలతో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న ఆయన కల సాకారం కాలేదు. అందుకే కూతురు రూపంలో తన కలను నెరవేర్చుకోవాలనుకున్నారు. కూతురుకు మెరుగైన క్రికెట్ శిక్షణను అందించాలని కుటుంబసభ్యులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇందుకోసం భద్రాచలంలో తన పేరిట ఉన్న జిమ్‌ను సగం ధరకు అమ్మాడు. ఇక ట్రైనింగ్ ఖర్చులకోసం భూమిని కూడా అమ్ముకున్నాడు. అయితే ఎప్పుడూ వీటి గురించి బాధపడలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రుల త్యాగం వృథా కానీయకుండా..

హైదరాబాద్‌కు వచ్చిన త్రిష తల్లిదండ్రుల త్యాగాన్ని వృథా చేయకూడదనుకుంది. తన వంతు కష్టపడింది. మొదట హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్-19, అండర్-23 జట్లలో ఆడడం ప్రారంభించింది. గతేడాది అండర్-19 మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఇక ఇటీవల అండర్‌–19 జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో కూడా రాణించటంతో అండర్‌–19 వరల్డ్‌ కప్‌ జట్టుకు త్రిషను ఎంపిక చేశారు. తల్లిదండ్రులతో పాటు సెలెక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రపంచకప్‌ టోర్నీలో ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టింది త్రిష.

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!