Washington Sundar: నాకు ఆ సమస్య ఉంది.. షాకింగ్ విషయం బయటపెట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్
తాజాగా న్యూజిలాండ్ సిరీస్-2023లో భాగంగా జరిగిన మొదటి టీ20లో బౌలింగ్‌లో 2 వికెట్లు, బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు సుందర్ . రెండో మ్యాచ్‌లోనూ 3 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి కీలకమైన కాన్వే వికెట్ తీశాడు.
సరిగ్గా రెండేళ్ల క్రితం.. అంటే 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్‌స్మిత్‌ను ఔట్ చేసిన తీరు.. అర్ధసెంచరీతో టీమిండియాను గెలిపించిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆతర్వాత గాయంతో కొన్ని రోజుల పాటు జట్టుకు దూరమైనా మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్‌తో సంచలనాలు సృష్టిస్తూనే బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. మేటి ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్-2023లో భాగంగా జరిగిన మొదటి టీ20లో బౌలింగ్‌లో 2 వికెట్లు, బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు సుందర్ . రెండో మ్యాచ్‌లోనూ 3 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి కీలకమైన కాన్వే వికెట్ తీశాడు. ప్రస్తుతం తన ఆల్‌రౌండ్ ఫెర్మామెన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోన్న సుందర్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే.. అతను కేవలం ఒక్క చెవితో మాత్రమే వినగలడట. ఈ విషయాన్ని సుందరే ఓ ఇంటర్వ్యూ లో బహిర్గతం చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వినికిడి లోపం ఉన్నప్పటికీ సుందర్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండడం యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక సుందర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే, అతను క్రిస్టియన్ ఏమోనని చాలామంది భావిస్తారు. అయితే అతను సంప్రదాయ తమిళ హిందూ కుటుంబానికి చెందిన వాడని సుందర్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. ‘సుందర్ చిన్నతనంలో మేం ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యాం. ఆ సమయంలో పీడీ వాషింగ్టన్ అనే ఓ సైనికుడు మా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్నాడు. ఆ కృతజ్ఞతతోనే మా అబ్బాయికి వాషింగ్టన్ పేరును జోడించాం’ అని స్పష్టత నిచ్చారు సుందర్ తండ్రి.
View this post on Instagram
మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..