- Telugu News Photo Gallery Cricket photos Yuzvendra Chahal has become the highest wicket taker for Team India in T20I and here is the top 5 players in this feat
Top 5 T20 Wicket Takers: భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 ఆటగాళ్లు వీరే.. మొదటి స్థానం ఎవరిదంటే..
యుజ్వేంద్ర చాహల్ టీ20 రికార్డ్: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో 2 ఓవర్లే వేసిన యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఇండియా తరఫున 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే ఆ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు చాహల్. మరి అతనితో పాటు టాప్ భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్ల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 31, 2023 | 8:00 AM

యుజ్వేంద్ర చాహల్ టీ20 రికార్డ్: న్యూజిలాండ్‌తో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లే వేసిన యుజ్వేంద్ర చాహల్ టీమ్ ఇండియా తరఫున 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు చాహల్.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్‌తోనే భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరి అతనితో పాటు టాప్ భారత్ తరఫున టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది..

1. యుజ్వేంద్ర చాహల్: అనతి కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన చాహల్ టీమిండియా తరపున టీ20 క్రికెట్‌లో 75 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లలో అతను 91 వికెట్లు తీసి టీ20 లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

2. భువనేశ్వర్ కుమార్: టీమిండియా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టి, ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

3. రవిచంద్రన్ అశ్విన్: భారత జట్టులోని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 65 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 72 వికెట్లు పడగొట్టాడు.

4. జస్ప్రీత్ బుమ్రా: టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా 60 టీ20 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు పడగొట్టాడు.

5. హార్దిక్ పాండ్యా: భారత తరఫున 86 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా మొత్తం 75 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేశాడు. దీంతో మొత్తం 65 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు ఈ ఆల్ రౌండర్.





























