David Warner: పఠాన్‌గా మారిపోయిన డేవిడ్‌ వార్నర్‌.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోన్న ఫ్యాన్స్‌

ముఖ్యంగా అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలతో వార్నర్‌ చేసిన హంగామా తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈక్రమంలో తాజాగా పఠాన్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడీ ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌.

David Warner: పఠాన్‌గా మారిపోయిన డేవిడ్‌ వార్నర్‌.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోన్న ఫ్యాన్స్‌
David Warner
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 9:32 AM

డేవిడ్‌ వార్నర్‌.. మైదానంలో దిగితే మెరుపులు మెరిపించే ఈ డ్యాషింగ్ బ్యాటర్‌ బయట చాలా సరదాగా ఉంటాడు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దా వ్యూస్‌, లైకులు వస్తుంటాయి. అందుకే ఆటతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు డేవిడ్‌. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు ప్రేక్షకులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడీ స్టార్‌ బ్యాటర్‌. సూపర్‌ హిట్‌ పాటలు, మాస్ స్టెప్పులను అనుకరించాడు. అలాగే స్టార్‌ హీరోలను ఇమిటేట్‌ చేశాడు. తెలుగుతో పాటు ఇతర భాష పాటలు, ఫ్యాన్స్​ ఎడిట్​ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలతో వార్నర్‌ చేసిన హంగామా తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈక్రమంలో తాజాగా పఠాన్‌ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడీ ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌. షారుఖ్‌ ఫేస్ ప్లేస్‌లో తన ఫొటోను రీప్లేస్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. దీనికి ‘వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలవా..? #legend #icon’ అని క్యాప్షన్ ఇచ్చాడు.

ప్రస్తుతం వార్నర్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. షేర్ చేస్తున్నారు. దయచేసి డేవిడ్ వార్నర్‌కు ఆస్కార్ ఇవ్వాలంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా వచ్చే నెల నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్‌ కోసం ఫిబ్రవరి 1న భారత్‌లో అడుగుపెట్టనుంది ఆస్ట్రేలియా జట్టు. కొన్ని రోజుల పాటు బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసీస్ జట్టు నాగ్‌పూర్‌కు బయల్దేరుతుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని కంగారూ జట్టు ఈ పర్యటనలో మొత్తం నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే