U-19 Women’s World Cup: 297 పరుగులు..11 వికెట్లు.. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వీరిదే కీ రోల్

అండర్‌ 19 మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌. కాగా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను టీమిండియా గెలవడంలో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన శ్వేత 99 సగటుతో 297 పరుగులు చేసింది.

U-19 Women’s World Cup: 297 పరుగులు..11 వికెట్లు.. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో వీరిదే కీ రోల్
Indian Women's Cricket Team
Follow us

|

Updated on: Jan 30, 2023 | 6:50 AM

షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌ 19 మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌. కాగా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను టీమిండియా గెలవడంలో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన శ్వేత 99 సగటుతో 297 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో చేసిన 92 పరుగులు టోర్నీలో ఆమె అత్యధిక స్కోర్. ఇక బౌలింగ్‌లో లెగ్‌స్పిన్‌తో పర్శవి ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టింది. 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో జట్టు కప్పు గెలవడంలో ప్రధాన భూమిక పోషించింది. గ్రూప్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్లు తీసిన ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో కూడా మూడు వికెట్లు తీసింది. ఇక ఫైనల్‌లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచింది. ఆఫ్‌ స్పిన్నర్లు మన్నత్‌ (9), అర్చన (8) కూడా అదరగొట్టారు. పేస్‌ సంచలనం టైటాస్‌ సాధు (6) కూడా ఆరంభ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేసింది. ఇక  భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మరో బౌలర్ మన్నత్ కశ్యప్. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఆమె ఆరు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో ఒక వికెట్‌తో రాణించింది.

ప్రత్యర్థులను తిప్పేశారు..

ఇక ఇప్పటికే సీనియర్‌ జట్టులో చోటు సంపాదించిన షెఫాలి కూడా ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో 172 పరుగులు చేసిన షెఫాలీ జట్టుకు అవసరమైన సందర్భాల్లో బంతితో రాణించింది. ఇక తెలంగాణ అమ్మాయి 17 ఏళ్ల త్రిష తన ప్రదర్శనతో మెప్పించింది. 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది. అందులో స్కాట్లాండ్‌పై ఓ అర్ధశతకమూ చేసింది. కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా ఆడింది. పిచ్‌ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది