IND vs NZ: న్యూజిలాండ్ పై పోరాడి గెలిచిన భారత్.. సిరీర్ సమం

స్పిన్నర్లకు మంచి అనుకువగా మారిన పిచ్‌పై సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఓవర్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

IND vs NZ: న్యూజిలాండ్ పై పోరాడి గెలిచిన భారత్.. సిరీర్ సమం
India
Follow us

|

Updated on: Jan 29, 2023 | 11:31 PM

లక్నోలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. స్టేడియంలో కూర్చున్న వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. స్పిన్నర్లకు మంచి అనుకువగా మారిన పిచ్‌పై సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఓవర్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

కేవలం 100 పరుగుల లక్ష్యం చిన్నదిగా కనిపించినా టీమ్‌ఇండియాకు తీవ్రంగా పోరాడింది. గత టీ20 మ్యాచ్‌ల మాదిరిగానే, ఈసారి కూడా శుభ్‌మన్ గిల్ , ఇషాన్ కిషన్‌ల ఓపెనింగ్ జోడీ ఆకట్టుకోలేక పోయారు. మొదట గిల్ ఔటయ్యాడు, కానీ 32 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసిన ఇషాన్ మరింత నిరాశపరిచాడు. పైగా అజాగ్రత్త వల్ల కూడా రనౌట్ అయ్యాడు. భారత స్పిన్నర్ల మాదిరిగానే న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కష్టతరం చేశారు.

భారత్ 11వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి వికెట్ కోల్పోయింది. అప్పటికి స్కోరు 50 పరుగులు. సూర్యకుమార్ క్రీజు తనదైన దూకుడుతో ఆటను రక్తికట్టించాడు. అతనికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా మద్దతుగా నిలవడంతో పరుగుల వర్షం కురిసింది. చివరి 6 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది, అయితే ఆ తర్వాత  2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఈ మొత్తం ఇన్నింగ్స్‌లో సూర్య 31 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ హార్దిక్‌తో కలిసి అజేయంగా 31 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా అతను జట్టును సిరీస్ కోల్పోకుండా కాపాడాడు.

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 5 టీ20 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ ఐదు మ్యాచ్‌ల్లో పరుగుల వర్షం కురవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రమే విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత స్పిన్నర్లు విధ్వంసం సృష్టించడంతో కొద్దిసేపటికే తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యారు. నలుగురు స్పిన్నర్లతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో దిగి అద్భుతంగా ఆడింది.  యుజ్వేంద్ర చాహల్ వికెట్లు తీయడం ప్రారంభించాడు, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అలాగే దీపక్ హుడా పరుగులను పూర్తిగా కట్టడి చేశారు. 10వ ఓవర్ వరకు న్యూజిలాండ్ 48 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కూడా కోల్పోయింది. చివరి 10 ఓవర్లలో చాలా పరుగులు వస్తాయని న్యూజిలాండ్ ఆశించింది, కానీ స్పిన్నర్లు , మీడియం పేస్ హార్దిక్ పాండ్యా-అర్ష్‌దీప్ సింగ్ ఆ ఆశలను అడియాశలు చేశారు. కివీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..