Hanuma Vihari: మళ్లీ ఒంటిచేత్తోనే బ్యాటింగ్.. మణికట్టు ఫ్రాక్చర్‌తో విహారి ఒంటరిపోరు.. ఫ్యాన్స్ ప్రశంసల వర్షం
టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తోన్న అతను తన జట్టును ఓటమినుంచి కాపాడేందుకు గాయాన్ని సైతం లెక్కచేయడం లేదు.
టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తోన్న అతను తన జట్టును ఓటమినుంచి కాపాడేందుకు గాయాన్ని సైతం లెక్కచేయడం లేదు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్‌లో ఒంటిచేత్తో బ్యాటింగ్ చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మ్యాచ్ తొలి రోజు ఆటలో స్పీడ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్‌కు గురయ్యాడు విహారి. అయితే జట్టు కష్టాల్లో ఉండడంతో ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ ఒంటిచేత్తో బ్యాటింగ్ చేశాడు. అది కూడా తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతి కష్టమ్మీద 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు అవసరమైన పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే అతని స్ఫూర్తిని అందుకోవడంలో తోటి క్రికెటర్లు విఫలమయ్యారు. దీంతో మూడోరోజే విహారి మళ్లీ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఆంధ్రా జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో మరోసారి బరిలోకి దిగిన విహారి ఎడమచేత్తో బ్యాటింగ్ చేశాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీల సాయంతో 15 పరుగులు చేశాడు. ఇక్కడ కూడా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అతను కొట్టిన బౌండరీలు మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ విహారి స్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. ఆతర్వాత మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే ఆలౌటైంది. అయితే .. 151 పరుగుల కీలకమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించుకున్న ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 93 పరుగులకు కుప్పకూలింది. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి.
Vihari steps out to off-spinner Saransh Jain and lofts him over mid-on for four! A cracking reverse-sweep follows to deep cover. Goosebumps!@sportstarweb #RanjiTrophy
— Lalith Kalidas (@lal__kal) February 2, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..