‘పాయే.. పాక్‌ క్రికెట్‌ పరువు మళ్లీ పాయే’.. లావుగా ఉన్నాడని తోటి ఆటగాడితో అసభ్యంగా ప్రవర్తించిన పాక్‌ పేసర్

ఎంత కాదనుకన్నా పాక్‌ క్రికెటర్లు ఆట కన్నా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఓవరాక్షన్‌కు మారుపేరుగా నిలిచే ఆ జట్టు క్రికెటర్ల ప్రవర్తన, బిహేవియర్‌ చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా చికాకు తెప్పిస్తుంది  కూడా.

'పాయే.. పాక్‌ క్రికెట్‌ పరువు మళ్లీ పాయే'.. లావుగా ఉన్నాడని తోటి ఆటగాడితో అసభ్యంగా ప్రవర్తించిన పాక్‌ పేసర్
Naseem Shah
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2023 | 6:42 PM

ఎంత కాదనుకన్నా పాక్‌ క్రికెటర్లు ఆట కన్నా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఓవరాక్షన్‌కు మారుపేరుగా నిలిచే ఆ జట్టు క్రికెటర్ల ప్రవర్తన, బిహేవియర్‌ చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా చికాకు తెప్పిస్తుంది  కూడా. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చోటు చేసుకుంది. పాక్‌ యంగ్‌ క్రికెటర్‌ నసీం షా ఇటీవల బాగానే రాణిస్తున్నాడు. వికెట్లు తీస్తూ పాక్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే గెలుపు గర్వం తలకెక్కిందేమో సొంత ఆటగాడినే బాడీ షేమింగ్‌ చేరాడు. లావుగా ఉన్న సహచర ఆటగాడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలిచాడు. లైవ్‌ మ్యాచ్లోనే బాడీ షేమింగ్‌ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా అతన్ని ఢీకొట్టాడు. తద్వారా తనత పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌ తరఫున పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ మొయిన్‌ ఖాన్‌ తనయుడు ఆజం ఖాన్‌, కొమిల్లా విక్టోరియన్స్‌ తరఫున నసీం షా బరిలో​కి దిగారు. కాగా ఆజం బ్యాటింగ్‌కు మైదానంలోకి వస్తుండగా నసీం అతనికి ఎదురెళ్లాడు. అతని బాడీని వెక్కిరిస్తూ అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ఆజంఖాన్‌ను ఢీకొట్టి, అతని బాడీపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఇవేవీ పట్టించుకోని ఆజం ఖాన్‌, నసీంను నెట్టేసి బ్యాటింగ్‌ చేసేందుకు వెళ్లాడు. అయితే నసీం మాత్రం అసలు తగ్గలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లతో పాటు పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా నసీం షాను సోషల్‌ మీడియాలో వాయిస్తున్నారు. ‘బాడీ ఎదిగినా బ్రెయిన్‌ ఎదగలేదు బ్రో’ ‘ గర్వం తలకెక్కించుకోకు’ ‘అప్పుడే అంత తలబిరుసా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సొంత ఆటగాడితో ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది. పరాయి దేశ క్రికెటర్లతో ఇలా బిహేవ్‌ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పేవారు అంటూ దేహశుద్ధి చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..