T20 Cricket: వావ్‌.. ధోనిని మరిపించాడుగా.. వికెట్లను చూడకుండానే సూపర్‌ త్రో.. దెబ్బకు బ్యాటర్‌ ఫ్యూజులౌట్‌

ధోని కీపింగ్‌లో బ్యాటర్లు క్రీజును దాటాలంటే ఒకటికి వెయ్యిసార్లు సంకోచిస్తారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో వికెట్లను చూడకుండానే మిస్టర్‌ కూల్‌ మెరుపు వేగంతో రనౌట్‌ చేసిన విధానం అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన సామ్‌ బిల్లింగ్స్‌ కూడా అదే చేశాడు.

T20 Cricket: వావ్‌.. ధోనిని మరిపించాడుగా.. వికెట్లను చూడకుండానే సూపర్‌ త్రో.. దెబ్బకు బ్యాటర్‌ ఫ్యూజులౌట్‌
Sam Billings Run Out
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2023 | 4:07 PM

వికెట్‌ కీపింగ్‌ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిది ప్రత్యేక స్థానం. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే అతను ఎంతోమందిని చిత్ర విచిత్రంగా రనౌట్లు చేశాడు. అందుకే ధోని కీపింగ్‌లో బ్యాటర్లు క్రీజును దాటాలంటే ఒకటికి వెయ్యిసార్లు సంకోచిస్తారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో వికెట్లను చూడకుండానే మిస్టర్‌ కూల్‌ మెరుపు వేగంతో రనౌట్‌ చేసిన విధానం అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఇంగ్లండ్‌కు చెందిన సామ్‌ బిల్లింగ్స్‌ కూడా అదే చేశాడు. వికెట్ల వెనకాల చిరుతలా కదులుతూ ఆశ్చర్యకరమైన రనౌట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. బిల్లింగ్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు తరపున కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ T20లో డెసర్ట్ వైపర్స్ తరపున ఆడుతున్నారు. ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్‌ అద్భుతమైన రనౌట్ చేశాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బెన్నీ హౌలీ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని జో డెన్లీ ఆఫ్‌ సైడ్‌ డిఫెన్స్‌ ఆడాడు. అంతే వెంటనే బంతిని అందుకుని వికెట్లను చూడకుండా త్రో చేశాడు వికెట్ కీపర్‌ బిల్లింగ్స్‌. దురదృష్టవశాత్తూ అప్పటికింకా క్రీజు బయటే ఉన్నాడు బ్యాటర్‌. దీంతో ఐదు బంతులు ఆడి ఒక్క పరుగే చేసిన డెన్లీ నిరాశతో పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాంచీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఇలాగే రనౌట్ చేశాడు. ధోనీ వికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ, బౌండరీ నుండి త్రో చూడకుండా వచ్చిన బంతితో వికెట్లను గిరాటేశాడు. ఇప్పుడీ రనౌట్‌తో ధోనిని గుర్తు చేశాడంటున్నారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. బకాగా 2018- 19 సీజన్‌లో ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు బిల్లింగ్స్‌.

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో వైపర్స్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం 20 ఓవర్లు ముగిసేసరికి వారియర్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైపర్స్ జట్టులో రోహన్ ముస్తఫా 33 బంతుల్లో 31 పరుగులు చేశాడు. చివర్లో హోవెల్ వేగంగా పరుగులు సాధించాడు. 23 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో అజేయంగా 34 పరుగులు చేశాడు. బిల్లింగ్స్ కూడా 27 పరుగులతో రాణించాడు. మరోవైపు వారియర్స్ తరఫున ఏ బ్యాటర్‌ కూడా క్రీజులో నిలువలేకపోయారు. పాల్ వాల్టర్ అత్యధికంగా 27 (23 బంతులు, నాలుగు ఫోర్లు) పరుగులు చేశాడు. నూర్ అహ్మద్ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, సిక్సర్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!