AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Prabha: భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందంటూ కథనాలు.. స్పందించిన సీనియర్‌ నటి రమాప్రభ

ప్రస్తుతం రమాప్రభ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, ఆమె భిక్షమెత్తుకుందంటూ యూట్యూబ్‌తో పాటు పలు సోషల్‌ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో కథనాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎంతోమందిని కలిచివేశాయి. తాజాగా వీటిపై స్పందించిన రమాప్రభ ఎమోషనలైంది

Rama Prabha: భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందంటూ కథనాలు.. స్పందించిన సీనియర్‌ నటి రమాప్రభ
Actress Rama Prabha
Basha Shek
|

Updated on: Feb 03, 2023 | 8:02 PM

Share

లేడీ కమెడియన్‌గా తనదైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు రమాప్రభ. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించారామె. సుమారు ఆరుదశాబ్దల సినీ కెరీర్‌లో 1400కు పైగా సినిమాల్లో నటించిన ఘనత రమా ప్రభ సొంతం. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్‌ రాజబాబుతో కలిసి రమాప్రభ చేసిన సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1970-80వ దశకంలో స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న రమాప్రభ అప్పటి వర్ధమాన నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అభిప్రాయభేదాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అదే సమయంలో సినిమాల ద్వారా సంపాదించిన రమాప్రభ కోట్ల ఆస్తులన్నీ కరిగిపోయాయి. కాగా ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు రమాప్రభ. వయోభారంతో అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారామె. కాగా గతేడాది కీర్తి సురేశ్‌ నటించిన గుడ్ లక్‌ సఖి సినిమాలో చివరిసారిగా కనిపించారు రమా ప్రభ. అంతకుముందు పూరిజగన్నాథ్‌ రొమాంటిక్‌ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఆయితే ప్రస్తుతం రమాప్రభ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, ఆమె భిక్షమెత్తుకుందంటూ యూట్యూబ్‌తో పాటు పలు సోషల్‌ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో కథనాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎంతోమందిని కలిచివేశాయి. తాజాగా వీటిపై స్పందించిన రమాప్రభ ఎమోషనలైంది. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను ప్రసారం చేయద్దంటూ అభ్యర్థించారు.

‘నేను అడుక్కు తింటున్నానంటూ కొందరు యూట్యూబ్ లో తెగ కథనాలు రాస్తున్నారు. నా సొంత యూట్యూబ్ ఛానల్ అయిన ‘రమాప్రభ ప్రయాణం’ లో నా ఇంటిని స్వయంగా దగ్గరుండి చూపించాను. నిజంగా నేను భిక్షమెత్తుకునే దీన పరిస్థితిలో ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నా యూట్యూబ్ వీడియోల కోసం నేను తలమునకలై ఉన్నాను. అలాంటిది ఏ గ్యాప్ లో నేను అడుక్కుంటాను? పూరీ, నాగార్జున, మరికొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వారికి తోచిన సహాయం చేస్తున్నారు. వారు నన్ను తమ ఇంటి మనిషిగా వాళ్లు ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకువుతుంది? వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరి కంటే నేను చాలా ధనవంతురాలిగా ఉన్నాను’ అని రమాప్రభ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..