Unstoppable 2: పవన్‌ బ్లాక్‌ సొక్కా ఏసాడంటే బొమ్మ బ్లాక్‌ బస్టరే.. మొదటి ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌.. రికార్డు బద్దలు

బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అన్నట్లుగానే బాలయ్య- పవన్‌ టాక్‌షోకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అయిన 14 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. తద్వారా ఆహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది

Unstoppable 2: పవన్‌ బ్లాక్‌ సొక్కా ఏసాడంటే బొమ్మ బ్లాక్‌ బస్టరే.. మొదటి ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌.. రికార్డు బద్దలు
Unstoppable 2 Nbk Pspk
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2023 | 7:17 PM

నందమూరి, మెగాభినులు ఎంతగానో ఎదురుచూస్తోన్న పవన్ కల్యాణ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ షో గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. మొత్తం రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుండగా.. మొదటి ఎపిసోడ్‌ ఇప్పటికే ఆహాలో ప్రసారమవుతోంది. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అన్నట్లుగానే బాలయ్య- పవన్‌ టాక్‌షోకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అయిన 14 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. తద్వారా ఆహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ‘పవన్‌ బ్లాక్ సోక్కా ఏసాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టరే’ అంటూ ఆహా యాజమాన్యం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్‌ చేసింది. అంతకుముందు బాలయ్య- పవన్‌ కల్యాణ్‌ ఇంటర్వ్యూను ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్‌ స్క్రీనింగ్ వేశారు. ఈ ఈవెంట్‌కు సుమారు 200 మంది అభిమానులు హాజరయ్యారు ఇక విజయవాడలోనూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్‌.

కాగా టాలీవుడ్‌లో నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య పోటీ ఉంటుంది. అయితే అది సినిమాల వరకు మాత్రమే ఉంటుంది. బయట మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని అన్‌స్టాపబుల్‌ షోతో మరోసారి రుజువైంది. తాజా ఎపిసోడ్‌లో బాలయ్య, పవన్ ఒకరిపై ప్రేమాభిమానాలు చాటుకున్నారు. తామిద్దరం ఎన్నో ఫంక్షన్స్, పార్టీలలో కలిసినట్లు చెప్పుకొచ్చారు. కాగా బాలయ్య- పవన్‌ కల్యాణ్‌ల ఇంటర్వ్యూల సెకెండ్‌ ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఆహా తెలిపింది. కాగా నిన్న ప్రసారమైన మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాల గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?