Varasudu OTT: ఓటీటీలోకి విజయ్ దళపతి సూపర్ హిట్ సినిమా.. వారసుడు స్ట్రీమింగ్ లేటెస్ట్ అప్డేట్ ఇదే
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న వారసుడు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది. థియేట్రికల్ రిలీజై నెల రోజులు కావడంతో ఫిబ్రవరి 22నుంచి విజయ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం వారిసు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో వారసుడుగా విడుదలైంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక ముందన్నా విజయ్ సరసన హీరోయిన్‌గా నటించింది. శరత్‌కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ విలన్‌గా మెప్పించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న (తెలుగులో జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీనికి తోడు సంక్రాంతి సీజన్ కావడంతో భారీ కలెక్షన్లను రాబట్టింది. విజయ్ నటన, రష్మిక అంద చందాలు, పాటలు వారసుడు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. దీంతో సుమారు రూ.200 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. కాగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న వారసుడు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది. వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజై నెల రోజులు కావడంతో ఫిబ్రవరి 22నుంచి విజయ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది.
కాగా ఇటీవల చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు కొద్దిరోజుల్లోనే ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలో వారసుడు కూడా థియేట్రికల్ రిలీజ్ తర్వాతి నెలరోజులకే ఓటీటీలో అడుగుపెట్టనుంది. కాగా వారసుడుకు పోటీగా విడుదలైన అజిత్ తునివు కూడా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 8న ఈ సినిమా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
Tamil film #Varisu is expected to premiere on Amazon Prime on February 22nd.
Also in Telugu as #Vaarasudu. pic.twitter.com/EkHueGRvTn
— Streaming Updates (@OTTSandeep) February 3, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.