Thunivu: ఓటీటీలోకి అజిత్ బ్లాక్ బస్టర్ హిట్.. తునివు రిలీజ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

అజిత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తునీవు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Thunivu: ఓటీటీలోకి అజిత్ బ్లాక్ బస్టర్ హిట్.. తునివు రిలీజ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Ajith Thunivu
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Feb 08, 2023 | 8:58 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. దక్షిణాదిలోనే అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు. అంతేకాకుండా స్టార్స్ లలో అజిత్ ప్రత్యేకం కూడా. సినిమా ప్రమోషన్లలో పాల్గొనరు. తన చిత్రాల గురించి ఎక్కడా మాట్లాడరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఇటీవల అజిత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తునీవు.  ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ హోచ్ వినోథ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఫిబ్రవరి 8న ఈ సినిమా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా.. బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో మంజు వారియర్ కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లోని యువర్ బ్యాంక్‌ను దోచుకోడానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. అందులోనే పోలీస్ ఆఫీసర్ రామచంద్ర (అజయ్) కూడా ఉంటాడు. అయితే ఆయన గ్యాంగ్ లోపలికి వెళ్లిన తర్వాత.. అక్కడ మరో గ్యాంగ్ చీఫ్ డార్క్‌డెవిల్ (అజిత్ కుమార్).. అతడి టీం రమణి (మంజు వారియర్) ఉంటారు. వాళ్లు కూడా బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేస్తారు. కానీ ఈ రెండు గ్యాంగ్స్ కాకుండా.. మూడో గ్యాంగ్ కూడా బ్యాంక్ లోపలే ఉంటారు. మరి మొదటి గ్యాంగ్ ఎందుకొచ్చారు.. అజిత్ అక్కడేం చేస్తున్నాడు.. మూడో గ్యాంగ్‌కు పనేంటి..? ఈ మూడు గ్యాంగ్స్‌‌లో ఎవరు బ్యాంక్ రాబరీ చేసారు..? అసలు అజిత్ ఎందుకు దొంగతనం చేయడానికి వస్తాడు..? అనేది అసలు కథ. గతంలో అదే బ్యాంక్ ప్రజల సొమ్ము 25 వేల కోట్లు కాజేస్తారు.. దాని కోసం డార్క్ డెవిల్ అజిత్ ఏం చేసాడు అనేది సినిమా.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే