Sushmita Konidela: నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇది.. సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’.

Sushmita Konidela: నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇది.. సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sushmita Konidela
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2023 | 9:21 PM

సంతోష్ శోభన్.. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్రహీరో. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన‌న్ని సుస్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ  ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుస్మిత మాట్లాడుతూ.. శ్రీదేవి శోభ‌న్‌బాబు నా మనసుకు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. సంతోష్‌, ప్ర‌శాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో క‌లిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్ర‌యాణం ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది అన్నారు. చిన్న ఆలోచ‌న‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా కోసం అంద‌రం మ‌న‌సు పెట్టి ప‌ని చేశాం. మా అంద‌రిలోని ఇన్నోసెంట్ ఎమోష‌న్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను అద్భుతంగా చేశాడు. గౌరికి తెలుగు రాక‌పోయినా నాతో కూర్చుని త‌మిళంలో అర్థం తెలుసుకుని దాన్ని తెలుగులో నేర్చుకుని మరీ న‌టించింది.
ప్ర‌శాంత్ బ‌లం.. నెటివిటీ. మ‌న ఇంట్లో మ‌నం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని చ‌క్క‌గా క్యారీ చేస్తాడు. అదే ఈ సినిమాలోనూ చేశాడు. త‌ను ప్రాణం పెట్టి.. చ‌క్క‌టి ఎమోష‌న్స్‌తో సినిమాను పూర్తి చేశాడు. బాషా, మొయిన్ వంటి యంగ్ టాలెంట్‌తో నే కాదు.. నాగ‌బాబుగారు, రోహిణిగారి వంటి సీనియ‌ర్స్ కూడా సినిమాలో న‌టించారు. గోల్డ్ బాక్స్ బ్యాన‌ర్ ముందు నేనున్న‌ప్ప‌టికీ నా వెనుక మావారు విష్ణు, మా కో ప్రొడ్యూస‌ర్ శ‌ర‌ణ్య స‌పోర్ట్‌గా నిలిచారు. ఫిబ్ర‌వ‌రి 18న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో ‘శ్రీదేవి శోభ‌న్‌బాబు’ సినిమా వస్తుంది. రేపు (సోమ‌వారం ) ఓ పాట‌ను రిలీజ్ చేస్తున్నాం. క‌మ్రాన్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ