Vani Jayaram: కెరీర్‌ ప్రారంభంలో కోఠి ఎస్‌బీఐలో పనిచేసిన వాణీ జయరాం.. లెజెండరీ సింగర్‌గా ఎలా మారారో తెలుసా?

వాణీ సినిమా రంగంలోకి రాకముందు మద్రాస్‌ ఎస్‌బీఐ బ్యాంకులో విధులు నిర్వర్తించారు . ఆ తర్వాత హైదరాబాద్‌లోని కోఠీ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. కొన్నేళ్ల పాటు ఇక్కడే విధులు నిర్వర్తించారు.

Vani Jayaram: కెరీర్‌ ప్రారంభంలో కోఠి ఎస్‌బీఐలో పనిచేసిన వాణీ జయరాం.. లెజెండరీ సింగర్‌గా ఎలా మారారో తెలుసా?
Singer Vani Jayaram
Follow us

|

Updated on: Feb 04, 2023 | 6:47 PM

19 భాషలు..1000కి పైగా సినిమాలు.. 20వేలకు పైగా పాటలు.. ఇలా సుమారు 5 దశాబ్దాల పాటు తేనె కన్నా తియ్యనైన స్వరంతో సంగీత ప్రియులను ఓలలాడించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ గాయని వాణీజయరాం అనుమానాస్పద మరణంతో సినిమా ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇక ఆమె గొంతు వినబడదన్న చేదు నిజాన్ని సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా తమిళనాడులోని వేలూరులో పుట్టి పెరిగిన వాణీ జయరాంకు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. వాణీ జయరాం సోదరుడు హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేశారు. ఇక వాణీ సినిమా రంగంలోకి రాకముందు మద్రాస్‌ ఎస్‌బీఐ బ్యాంకులో విధులు నిర్వర్తించారు . ఆ తర్వాత హైదరాబాద్‌లోని కోఠీ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. కొన్నేళ్ల పాటు ఇక్కడే విధులు నిర్వర్తించారు. ఇక ఈ లెజెండరీ సింగర్‌ వివాహం కూడా సికింద్రాబాద్‌లోనే జరిగింది. ‘నా మనసులో హైదరాబాద్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. ఈ నగరంతో నాది జన్మజన్మల అనుబంధం అనిపిస్తుంటుంది. నా అసలు పేరు కలైవాణి. అయితే జయరామ్‌తో పెళ్లి తర్వాత వాణీ జయరామ్‌గా మారాను. జయరామ్ ఉద్యోగరీత్యా ఆయనతో పాటే ముంబై వెళ్లాను. కానీ పీబీ శ్రీనివాస్ అవార్డు, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, సత్కారాలన్నీ హైదరాబాద్‌లోనే అందుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వాణీ జయరాం.

మరోవైపు వాణీ జయరాం మృతిపై హఠాన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇక సీఎం స్టాలిన్‌ కూడా దిగ్గజ గాయని మృతిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??