IND vs AUS: షమీ సూపర్‌ బాల్‌కు గాల్లోకి ఎగిరిన స్టంప్‌.. దెబ్బకు బిక్క మొహం వేసిన ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌

ఈ సిరీస్‌కు ముందు టీమిండియా స్పిన్నర్ల గురించి తెగ భయపడింది ఆసీస్‌. అయితే అంతకుముందే కంగారూలకు షాక్‌ ఇచ్చారు భారత జట్టు ఫాస్ట్‌ బౌలర్లు. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియాకు శుభారంభం అందించాడు

IND vs AUS: షమీ సూపర్‌ బాల్‌కు గాల్లోకి ఎగిరిన స్టంప్‌.. దెబ్బకు బిక్క మొహం వేసిన ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌
Ind Vs Aus 1st Test
Follow us

|

Updated on: Feb 09, 2023 | 11:13 AM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు నాగ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కాగా ఈ సిరీస్‌కు ముందు టీమిండియా స్పిన్నర్ల గురించి తెగ భయపడింది ఆసీస్‌. అయితే అంతకుముందే కంగారూలకు షాక్‌ ఇచ్చారు భారత జట్టు ఫాస్ట్‌ బౌలర్లు. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియాకు శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే ఉస్మాన్‌ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. 3 బంతులాడిన ఖవాజా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక సిరాజ్‌ అందించిన సూపర్‌ స్టార్ట్‌తో సీనియర్‌ బౌలర్‌ షమీ సైతం రెచ్చిపోయాడు. తర్వాత ఓవర్‌ తొలి బంతికే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. షమీ వేసిన సూపర్‌ గుడ్‌ లెంగ్త్‌ బాల్‌ను వార్నర్‌ ఏ మాత్రం అడ్డుకోలేకపోయాడు. డిఫెన్స్‌ ఆడబోయి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాగా మెరుపు వేగంతో వచ్చిన బంతి వికెట్లను తాకడంతో స్టంప్‌ గాల్లో ఎగిరిపడింది. దీంతో బిక్కమొహం వేసిన వార్నర్‌ (1) నిరాశగా పెవిలియన్‌ వైపు దారి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ నిలకడగా ఆడుతోంది. కడపటి వార్తలందే సమయానికి 21.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ఆ జట్టు సీనియర్‌ బ్యాటర్లు మార్కస్‌ లబుషేర్‌ (30), స్టీవ్‌ స్మిత్‌ (10) నిదానంగా ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. వీరిద్దరూ అజేయమైన మూడో వికెట్‌కు 117 బంతుల్లో 48 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్లు ఖవాజా (1), డేవిడ్‌ వార్నర్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే ఔటయ్యారు. కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో కనీసం మూడు టెస్టులు గెలవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..