కుంబ్లే, వార్న్‌లకు సాధ్యం కాలేదు.. ఈ బౌలర్ ఒక మ్యాచ్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు.. ఎవరో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్‌లో సుసాధ్యం కానీ రికార్డులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం..
అంతర్జాతీయ క్రికెట్‌లో సుసాధ్యం కానీ రికార్డులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం. ఇప్పటిదాకా ఈ ఫీట్ అందుకున్న ఆటగాళ్లు కొందరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఇంగ్లాండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్. అతడు ప్రపంచంలో బెస్ట్ బౌలర్. ఒక జట్టుపై.. ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు పదేసి వికెట్లు తీశాడు. ఈరోజు అంటే ఫిబ్రవరి 9వ తేదీన ఈ చారిత్రక క్రీడాకారుడి పుట్టినరోజు. మరి అతడి రికార్డులపై ఓ లుక్కేద్దాం పదండి..
1956లో లేకర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియాపై ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై సర్రేతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన లేకర్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడి బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది సర్రే.
అనంతరం, అదే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో 90 పరుగులిచ్చి 19 వికెట్లు పడగొట్టాడు జిమ్ లేకర్. పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. టెస్ట్‌లతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ ఓ ఇంగ్లాండ్ బౌలర్‌కి ఇదే అత్యుత్తమ గణాంకాలు. ఇక లేకర్ తర్వాత 1999లో పాకిస్థాన్‌పై భారత ఆటగాడు అనిల్ కుంబ్లే, 2021లో న్యూజిలాండ్ ఆటగాడు ఎజాజ్ పటేల్ కూడా టీమ్ ఇండియాపై 10 వికెట్ల ఫీట్ సాధించారు. కానీ ఒక్క మ్యాచ్‌లో 19 వికెట్లు తీసిన లేకర్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు.