Prabhas: కృతి సనన్‌తో పెళ్లి.. మాల్దీవుల్లో ఎంగేజ్‌మెంట్ వేడుక.. స్పందించిన ప్రభాస్‌ టీమ్‌.. ఏమన్నారంటే?

'ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అయితే అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నా' అని అతను పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అభిమానులు ఈ పోస్ట్‌ చూసి నిజమో, అబద్ధమో తెలియక తెగ గందరగోళంలో పడిపోయారు.

Prabhas: కృతి సనన్‌తో పెళ్లి.. మాల్దీవుల్లో ఎంగేజ్‌మెంట్ వేడుక.. స్పందించిన ప్రభాస్‌ టీమ్‌.. ఏమన్నారంటే?
Prabhas, Kriti Sanon
Follow us
Basha Shek

|

Updated on: Feb 09, 2023 | 1:30 PM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ పెళ్లిపీటలెక్కనున్నాడా? తన ఆదిపురుష్‌ జోడి కృతి సనన్‌తో మాల్దీవుల్లో ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అయ్యాడా? ఇలా.. గత రెండు రోజులుగా ప్రభాస్‌ నిశ్చితార్థానికి సంబంధించిన పుకార్లు తెగ షికార్లు చేశాయి. మొదట బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు ఈ రూమర్లకు బీజం వేశాడు. ‘ప్రభాస్ కి కృతి సనన్ కి వచ్చే వారం ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అయితే అదీ ఇక్కడ ఇండియా లో కాదు, మాల్దీవ్స్ అని పెట్టాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నా’ అని అతను పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ప్రభాస్‌ అభిమానులు ఈ పోస్ట్‌ చూసి నిజమో, అబద్ధమో తెలియక తెగ గందరగోళంలో పడిపోయారు. అయితే ఎట్టకేలకు తమ ఎంగేజ్‌మెంట్‌ వార్తలపై ఆదిపురుష్‌ జోడి స్పందించింది. ముందుగా ప్రభాస్‌ పీఆర్‌ టీమ్‌ స్పందించింది. ‘ ప్రభాస్‌, కృతి సనన్‌ మంచి స్నేహితులు మాత్రమే. వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అని కుండ బద్ధలు కొట్టింది. అటు ప్రభాస్ సహనటులు, స్నేహితులు కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు. ఇక కృతి సనన్‌ టీం కూడా ఈ వార్తలపై స్పందించింది. ప్రభాస్‌తో ఎంగేజ్‌మెంట్ వట్టి పుకారేనని క్లారిటీ ఇచ్చింది.

కాగా ప్రభాస్, కృతి సనన్ జంటగా ‘ఆదిపురుష్’ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో కృతి, రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి తోడు భేడియా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ ధావన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభాస్- కృతి సనన్‌ల డేటింగ్‌ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఆ సమయంలో దీపికా పదుకొనేతో షూటింగ్‌లో ఉన్న ఓ హీరో మనసులో కృతి సనన్‌ పేరు ఉందంటూ సరదాగా వరుణ్‌ వ్యాఖ్యానించాడు.ఆ సమయంలో దీపికాతో ప్రాజెక్టు- కే షూటింగ్‌లో ఉంది ప్రభాసే కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు. దీనిపై అప్పుడే స్పందించిన కృతి అవన్నీ వుట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి తనే స్వయంగా అందరికీ చెబుతానని వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే