Pooja Ramachandran: అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న బిగ్‌బాస్‌ ముద్దుగుమ్మ.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోలు వైరల్‌

కర్లీ హెయిర్‌తో ఎంతో క్యూట్‌గా కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన పూజ ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లోనూ పాల్గొంది. తద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇలా వెండితెర, బుల్లితెరపై రాణిస్తోన్న పూజా రామచంద్రన్‌ త్వరలో తల్లికానుంది.

Pooja Ramachandran: అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న బిగ్‌బాస్‌ ముద్దుగుమ్మ.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోలు వైరల్‌
Pooja Ramachandran, John
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2023 | 9:13 AM

స్వామిరారా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రముఖ నటి పూజా రామచంద్రన్‌. ఈ సినిమాలో హీరో నిఖిల్‌ ఫ్రెండ్స్‌లో ఒకరిగా నటించిన ఆమె తన అందం, తెలివితేటలతో అందరినీ బురిడి కొట్టిస్తుంది. అలా కర్లీ హెయిర్‌తో ఎంతో క్యూట్‌గా కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన పూజ ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లోనూ పాల్గొంది. తద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇలా వెండితెర, బుల్లితెరపై రాణిస్తోన్న పూజా రామచంద్రన్‌ త్వరలో తల్లికానుంది. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్‌గా అదరగొడుతోన్న జాన్ కొక్కెన్‌తో కలిసి ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈక్రమంలో పూజ సీమంతం వేడుకలను కనులపండవగా నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల తార. దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కాబోయే అమ్మానాన్నలకు ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా పూజా- జాన్‌లిద్దరికీ ఇది రెండో వివాహం. మొదట 2010లో విజె క్రెయిగ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది పూజ. అయితే కొద్ది కాలానికే ఇద్దరూ.విడాకులు తీసుకుని విడిపోయారు. ఆతర్వాత జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది పూజ.  2019లో వీరి పెళ్లి జరిగింది. ఇప్పుడీ ప్రేమ బంధానికి గుర్తుగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

స్వామిరారాతో పాటు లవ్‌ ఫెయిల్యూర్‌, త్రిపుర, దోచేయ్‌, దళం, సిద్ధార్థ్‌, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీమామా, ఎంత మంచివాడవురా, పవర్‌ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు వంటి సినిమాల్లో నటించింది పూజ. ఇక జాన్‌ కొక్కెన్‌ విషయానికొస్తే.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల అజిత్‌ నటించిన తునివు (తెలుగులో తెగింపు) సినిమాలోనూ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by John Kokken (@highonkokken)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!