Food Risk: ఈ 5 ఆహారాలు పరిమితికి మించి తీసుకుంటున్నారా..? వెంటనే ఆపకుంటే డయాబెటిస్, స్థూలకాయం ఖాయం..!
కొన్ని రకాల ఆహార పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ పరిమితికి మించి తీసుకోవడం వల్లనే ఇలా ఆరోగ్య సమస్యలు
ప్రస్తుత కాలంలో చాలా మంది స్థూలకాయం, డయాబెటిస్, బీపీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు గల ప్రధాన కారణం వారు పాటిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లే. మనం రోజూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్ధాలు మన ఆరోగ్యానికి హాని కల్గిస్తున్నాయి. వీటిని పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పరిమితికి మించి తీసుకోవడం వల్లనే ఇలా ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యమైనవి వైట్ ఫుడ్స్. ఇవి ఆరోగ్యంపై ఎంతగానో దుష్ప్రభావం చూపిస్తుంటాయి. వీటి వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఒబెసీటీ, డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి ఇందుకు కారణమవుతున్న ఆ వైట్ ఫుడ్స్ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నం: అన్నం లేకుండా భోజనం అసంపూర్తిగా ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజమే. ఆ కారణంగానే చాలామంది అన్నం ఇష్టంగా తింటుంటారు. అయితే ప్రోసెస్ చేసే క్రమంలో ఇందులో ఉండే పోషకాలు తొలగిపోతాయి. ఆ కారణంగానే వైట్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు వెంటాడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నిత్యం అన్నం తినకుండా మధ్యమధ్యలో చపాతీ, పూరీ వంటి ఇతర ఆహారాలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బంగాళదుంప: బంగాళదుంప అంటే అందరికీ ఇష్టమే. కానీ స్థూలకాయం, డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టాలంటే బంగాళదుంప సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలో స్టార్చ్, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పొటాటోని డీప్ ఫ్రై లేదా వెన్న, క్రీమ్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత హానికరం. బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కేవలం డయాబెటిస్ సమస్యే కాకుండా.. కేన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది.
పంచదార: వైట్ ఫుడ్స్‌లో పంచదార మరింత ప్రమాదకరం. రిఫైండ్ షుగర్‌ను ఎంప్టీ కేలరీగా పిలుస్తారు. ప్రోసెస్డ్, రిఫైండ్ పంచదారలో ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి ఉండవు. పంచదార నేరుగా రక్తంలో కలిసిపోతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరిగి డయాబెటీస్ సమస్యగా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఉప్పు: ఉప్పు లేకపోతే ఆహారానికి రుచి అనేదే ఉండదు. అయితే పరిమితికి మించి ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికారకం. శరీరంలో తగిన సోడియం, క్లోరైడ్ సమస్య ఉప్పు కారణంగానే ఏర్పుడుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణంపై ప్రభావం పడుతుంది. దాంతో బ్లడ్ వెస్సెల్స్ దెబ్బతింటాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎముకలు బలహీనమవుతాయి. ఇంకా కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.
మైదా: మైదాతో తయారయ్యే వైట్ బ్రెడ్, కేక్, బిస్కట్, పేస్ట్రీ వంటి పదార్ధాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. గోధుమల్ని రిఫైండ్ చేసినప్పుడు ఫైబర్, మంచి కొలెస్ట్రాల్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్లు తొలగిపోతాయి. గర్భిణీలకు మైదా ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్ ముప్పుకు కారణమవుతుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..