Ram Mandir: వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతనిలా నటిస్తూ రామమందిరాన్ని పేల్చేస్తామని బెదిరింపు .. దంపతులు అరెస్ట్..
అయోధ్యలోని రామాలయంపై దాడి చేస్తామని బెదిరించిన మహారాష్ట్ర జంటను పోలీసులు అరెస్టు చేశారు.ఈ దంపతుల దగ్గరనుంచి పవిత్ర గ్రంథం, రెండు పుర్రెలు, నిమ్మకాయలు సహా మరికొన్ని వస్తువులను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించిన మహారాష్ట్రకు చెందిన దంపతులను అయోధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2న..అనుమానితుడు రామ్‌కోట్ ప్రాంతంలోని రాంలాల్లా సదన్ ఆలయానికి సమీపంలో నివసిస్తున్న స్థానికుడికి ఫోన్ చేసి.. ఆలయ సముదాయాన్ని పేల్చివేస్తానని బెదిరించాడని అయోధ్య సర్కిల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ గౌతమ్ చెప్పారు. అనుమానితుడు అనిల్ రాందాస్ ఘోడకే ఢిల్లీ నివాసి బిలాల్‌గా నటించి సోషల్ మీడియా ద్వారా కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు తన భర్త అనిల్ రాందాస్ కు భార్య సహకరించిందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ జంట డబ్బుల కోసం అనేకమందిని మోసం చేసేవారని.. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేవారని.. ఈ దంపతుల దగ్గరనుంచి పవిత్ర గ్రంథం, రెండు పుర్రెలు, నిమ్మకాయలు సహా మరికొన్ని వస్తువులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ నిందితుల జంట వాస్తవానికి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా వాసులు. అయితే వీరిని సెంట్రల్ ముంబైలోని చెంబూర్ పరిసరాల్లోని ఒక ఫ్లాట్‌లో అరెస్ట్ చేసినట్లు అయోధ్య సర్కిల్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ గౌతమ్ తెలిపారు. .
తమ విచారణలో అనిల్ రాందాస్.. బిలాల్ అనే అతని చెల్లెలుతో స్నేహం చేసినట్లు.. అయితే అప్పటికే అనిల్‌కు పెళ్లయిందని తెలుసుకున్న ఆ యువతి అతడితో సంబంధాన్ని తెంచుకుంది. అప్పటి నుంచి అనిల్ తన భార్య సహాయంతో ఆ యువతిని డబ్బులకోసం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.
బిలాల్ ల దృష్టికి అసలు విషయం చేరుకుంది. దీంతో అతను ఆ జంటపై గొడవపడి.. తన సోదరికి దూరంగా ఉండమని చెప్పాడు. దీంతో దంపతులు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశారు. బిలాల్‌గా నటిస్తూ ఢిల్లీ మెట్రోను, రామమందిరాన్ని పేల్చివేస్తామని ఆ దంపతులు బెదిరించారు. వారు ప్రాక్సీ నంబర్‌ను ఉపయోగించి బిలాల్‌ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు నిందితులిద్దరినీ గుర్తించారు. ఇప్పటికే గుర్తుతెలియని వ్యక్తులపై ఫిబ్రవరి 2వ తేదీన IPC సెక్షన్ 507 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..