AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Test Kit: కూతురు దగ్గర ఊహించని వస్తువులను చూసిన తల్లిదండ్రులు.. ఇంత కఠిన శిక్షనా..!

21 ఏళ్ల యువతి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ తల్లిదండ్రుల కంట పడ్డాయి. దీంతో తమ కూతురికి ఎవరితోనైనా సంబంధం ఉందని అనుమానించారు.. కూతురు తమ పరువు తీస్తుందని భావించి గొంతు కోసి చంపేశారు.

Pregnancy Test Kit: కూతురు దగ్గర ఊహించని వస్తువులను చూసిన తల్లిదండ్రులు.. ఇంత కఠిన శిక్షనా..!
Pregnancy
Surya Kala
|

Updated on: Feb 09, 2023 | 10:35 AM

Share

చిన్న చిన్న కారణాలతో పేగుబంధాన్ని కూడా మరచి కడుపున పుట్టిన పిల్లలని కూడా చంపేయడానికి వెనుకాడడం లేదు తల్లిదండ్రులు.. తాజాగా తమ కూతురుకి ఎవరితోనో సంబంధం ఉందని తల్లిదండ్రులు అనుమానించారు. అంతేకాదు కూతురిని చంపేసి.. గుర్తుపట్టకుండా యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కౌశాంబిలోని టెన్న్ షా అలమాబాద్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ తల్లిదండ్రుల కంట పడ్డాయి. దీంతో తమ కూతురికి ఎవరితోనైనా సంబంధం ఉందని అనుమానించారు.. కూతురు తమ పరువు తీస్తుందని భావించి గొంతు కోసి చంపేశారు.

మృతురాలి తండ్రి నరేష్ ఫిబ్రవరి 3న తన కుమార్తె తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. మంగళవారం ఆమె మృతదేహాన్ని గ్రామం వెలుపల కాలువ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3న తమ కుమార్తెను నరేష్‌, అతని భార్య శోభాదేవి తమ ఇంట్లో గొంతుకోసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని  తెలిపారు.

భార్యాభర్తలు తమ ఇద్దరు బంధువుల సహాయంతో కూతురిని హత్య చేసారని చెప్పారు. మృత దేహం గుర్తుపట్టకుండా..  శరీరంపై యాసిడ్ పోశారు.. దీంతో నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.  మృతురాలి తండ్రి నరేష్ కు అతని ఇద్దరు సోదరులు గులాబ్, రమేష్ లు సహకరించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తన కూతురు చాలా మంది అబ్బాయిలతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుందని నరేష్ పోలీసులకు తెలిపాడు. “తన కూతురు దగ్గర కొన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు కూడా లభించాయి.. దీంతో నరేష్ తన కుమార్తెకు అబ్బాయితో సంబంధం ఉందని..  అనుమానించాడు. దీంతో తన భర్య ఇద్దరు సోదరులతో కలిసి హత్య చేసి.. శవాన్ని ఊరు చివర కాలవలో పడేసి.. ఏమీ తెలియనట్లు కూతురు మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తల్లిదండ్రులతో పాటు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
రిటైర్మెంట్ ప్లాన్‌తోనే లార్డ్స్ బరిలోకి రోహిత్.. చివరి నిమిషంలో
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
ప్రపంచ వేదికపై సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్న చేనేత కళ
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ. 3.46 లక్షలకే 10 రోజుల జపాన్ యాత్ర
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన..
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
భారత రైతు చెమట కష్టానికి ప్రపంచం ఫిదా..!
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
బోనాల పండుగ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేస్తే.. సూపర్ టేస్ట్
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
వామ్మో.. మొబైల్ కవర్‌లో ఈ ఒక్క ఆకు పెడితే అదృష్టం కలిసొస్తుందా?.
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం
బట్టలు ఉతికేటప్పుడు ఈ ఒక్క పొరపాటు చేస్తే వాషింగ్ మెషీన్‌కే నష్టం
బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే..
బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే..
శ్రీశైలంలో పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..?
శ్రీశైలంలో పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..?