Mahashivratri: ఈ రాశులవారిపై శివుని ప్రత్యేక అనుగ్రహం.. మహాశివరాత్రిన ఈ రాశివారు ఎలా పూజించాలంటే
మొత్తం 12 రాశులలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు శివయ్యకు ఇష్టమైన రాశులు.. మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు ఎలా పూజించాలో తెలుసుకుందాం.
శివుడిని పూజిస్తే.. మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు వెంటనే తొలగిపోతాయి. పురాణాల ప్రకారం సోమవారాలు, ప్రదోష వ్రతం, శివరాత్రి, మహాశివరాత్రిల్లో శివయ్య ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 18న జరుపుకోనున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశులలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై శివయ్య ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు శివయ్యకు ఇష్టమైన రాశులు.. మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు ఎలా పూజించాలో తెలుసుకుందాం.
- మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషం. మేష రాశికి అధిపతి అంగారకుడు. శివుడికి ఇష్టమైన రాశుల్లో ఒకటి మేషరాశి. మహాశివరాత్రి పర్వదినం మేషరాశి వారికి ఎంతో శుభప్రదం. ఈ రోజున పరమశివుని ప్రత్యేక అనుగ్రహం పొందితే.. అన్ని రకాల కోరికలు త్వరలో నెరవేరుతాయి.
- వృషభ రాశి శుక్రుడు ఈ రాశికి అధిపతి. శుక్రుడు ఆనందం, శోభ, విలాసాన్ని ప్రసాదించే గ్రహంగా పరిగణించబడుతుంది. అంతేకాదు శుక్రుడు శివుని భక్తుడు. అటువంటి పరిస్థితిలో మహాశివరాత్రి రోజున ఈ రాశి వారికి శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి.
- మిధునరాశి ఈ రాశికి అధిపతి బుధుడు. తారాచంద్రులకు జన్మించిన వాడు బుధుడు. దీంతో శివుని ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఈ రాశివారిపై ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి నాడు మిథున రాశి వారికి అనేక రకాల శుభవార్తలు వినే అవకాశాలున్నాయి.
- కర్కాటక రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు. శివుడు భక్తుడు చంద్రుడు. శివుడు ఎల్లప్పుడూ చంద్రుడిని తన నుదుటిపై ధరిస్తాడు. కనుక ఈ రాశి శివునికి ఇష్టమైన రాశుల్లో ఒకటి. మహాశివరాత్రి నాడు శివయ్యకు గంగాజలంతో అభిషేకం చేస్తే అన్ని రకాల కోరికలు త్వరగా నెరవేరుతాయి.
- సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు శివుడిని పూజిస్తాడు. శివయ్య అనుగ్రహం సింహ రాశి వ్యక్తులపై ఉంటుంది. సింహ రాశి వారికి అన్ని రకాల కోరికలు నెరవేరేలా భోళాశంకరుడు అనుగ్రహం ఉంటుంది. రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయడం వలన అనుగ్రహం పొందుతారు.
- తుల రాశి ఈ రాశికి కూడా శుక్రుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో మహాశివరాత్రి నాడు భోళాశంకరుడు ఆశీస్సులు ఈ రాశివారిపై ఉంటాయి. మహాశివరాత్రి నాడు శివుని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.
- మకరరాశి మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. మహాదేవుని భక్తుడు. అటువంటి పరిస్థితిలో శివయ్యకు ఇష్టమైన రాశుల్లో ఈ రాశి కూడా ఒకటి. ఈ రాశిపై శివుడు, శనీశ్వరుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. ఈ మహాశివరాత్రి రోజున శివయ్యకు జలాభిషేకం, శివ పంచాక్షరీ మంత్రాలు తప్పనిసరిగా చేయాలి.
- కుంభ రాశి మకరం కాకుండా, కుంభ రాశికి కూడా అధిపతి శనీశ్వరుడే. అటువంటి పరిస్థితిలో, భోలేనాథ్‌కి ఇష్టమైన రాశిచక్రాలలో ఈ రాశి కూడా ఒకటి. ఈ మహాశివరాత్రి రోజున శివయ్యకు జలాభిషేకం, శివ పంచాక్షరీ మంత్రాలు తప్పనిసరిగా చేయాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)